CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కామాంధుడికి ఉరి శిక్ష వేయాల్సిందే

Share it:

 


- నిరసన జ్వలలు 

- కొవ్వొత్తులతో ర్యాలీలు

 - ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం 

- కన్నెర్ర చేసిన మహిళా సంఘాల నాయకురాళ్లు 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్12 మన్యం టీవీ : గిరిజన చిన్నారిపై లైంగిక దాడి చేసి గొంతు నులిమి చంపిన నరరూప రాక్షసుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఇటు దిశ కమిటీ సభ్యులు అటు మహిళా సంఘాల నాయకురాళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి జిల్లా పరిధిలోని ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాలలోనే కాకుండా చర్ల, దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపాడు తదితర మండలాల్లో దిశప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించి కామాంధుడిని కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దిశ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతితో పాటు ఇతర మహిళా సంఘాల వారు మాట్లాడుతూ చిన్నారిపై అత్యాచారం చేసి మట్టుపెట్టిన కామాంధుడికి బతికే హక్కు లేదన్నారు. నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒకచోట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల వల్లే మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని మద్యం దుకాణాలను ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారిపై జరిగిన ఘటన మరోకరికి జరగకుండా చూడాలని పేర్కొన్నారు. మరొక కన్న పేగు తల్లడిల్లకుండా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా విద్యార్ధినీలు, నారీమణులు, మహిళా సంఘాల సభ్యులు, దిశ కమిటీ మెంబర్స్, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలి-వేముల భారతి వ్రతాప్ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయలతో పాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా చిన్నారి కుటుంబానికి అండగా నిలువాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ లో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. మద్యం దుకాణాలను, ఊరూరా ఉన్న మద్యం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని వేముల భారతి ప్రతాప్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా  ఈ కార్యక్రమంలో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటపల్లి మాధవిలత వైస్ ప్రెసిడెంట్ సుష్మ , లక్ష్మి, కళ్యాణి, రామ సీత కళ్యాణి, షబానా, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: