CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు రాష్ట్రమంతటా అమలు చేయాలి

Share it:

 



రాజుపేటలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా



మన్యం టీవీ మంగపేట.



06-09-2021 సోమావారం రోజున జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి  ములుగు ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా అధ్యక్షులు నల్లేలా కుమారన్న  ఆదేశాల మేరకు  మంగపేట మండలం రాజుపేట  గ్రామపంచాయతీలో దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమం ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి ఆధ్వర్యంలో దళితవాడల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పల్లికొండ యాదగిరి మాట్లాడుతూ దళిత బంధు రాష్ట్ర మంతటా అమలు చేయాలి. వెంటనే దళిత గిరిజన విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ డి ఎస్ సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన   ఎస్ టి సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీ గుమ్మడి సోమయ్య  మాట్లాడుతూ దళితున్ని ముఖ్యమంత్రి  చేస్తానని చెప్పి చేయలేదు, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు, డబల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదు, రాజుపేట గ్రామ పంచాయతీలో ఇప్పటివరకు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదు , ఏడు సంవత్సరాల కాలంలో ఒక్క  డిఎస్సీ కూడా పెట్టలేదు, చదువుకున్న విద్యార్థులు ఎస్సీ ఎస్టీ లు  నిరుద్యోగులుగా మిగిలి పోయారు, ఉద్యోగాలకు వయోపరిమితి పెంచారు కాని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు,ఉప ఎన్నికలు రాగానే ఒక్క హుజరాబాద్ లోనే ఓట్ల కోసం దళిత బంధు ప్రకటించి న  సీఎం కెసిఆర్ రాష్ట్రమంతటా అమలు చేయాలని ఈరోజు దళితవాడల్లో గడపగడపకు తిరుగుతూ అర్జీ పత్రాలు అందజేశారు ఇక నుండైనా కెసిఆర్ మోసపూరితమైన మాటలను  ప్రజలు నమ్మవద్దని అన్నారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి .,మంగపేట మండలం అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, . మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మైబూబ్ ఖాన్,   యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, గారు. యూత్ మండల్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు,మండల ఉపాధ్యక్షుడు తుడీ భగవాన్ రెడ్డి, ఎస్ టి సి సెల్ మండల అధ్యక్షుడు చదా మల్లయ్య, మండల మహిళ అధ్యక్షురాలు అల్లా రాధారాణి,. సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, రాజుపేట గ్రామ అధ్యక్షులు పోట్రు సమ్మయ్య, రాజుపేట గ్రామ యూత్ అధ్యక్షులు కరకపల్లి సాంబమూర్తి, రమనక్కపేట గ్రామ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణ్,సీనియర్ నాయకులు పూజారి సురేందర్ బాబు, వెంగల బుచ్చిరెడ్డి, ధీకొండా కాంతారావుగారు,గోగులముడి అనిల్ కుమార్, .ఆకుతోట వెంకన్న .ముఖర్జీ,బోనుగు హనుమంతురావు,కాపుల నాగరాజు గారు.మైపా శ్రీను .వెంకట్రావు,తీగల మల్లారెడ్డి గాంగెర్ల రాజరత్నం, కర్రీ చిన్నపుల్లయ్య గారు,తోట అశోక్ కుమార్. జంగం ఆదిత్య .మీ,గాంగె ర్ల సందీప్,జంగం జయరాజ్  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: