CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రానున్న మూడు రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు - అత్యవసర సేవల కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ సౌకర్యం.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) మూడు రోజుల పాటు జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అత్యవసర సేవలు కొరకు ఈ దిగువ తెలిపిన కంట్రోల్ రూమ్ నంబర్లకు కాల్ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పని చేయు విదంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు దాటొద్దని ప్రమాదం పొంచి ఉందని, నీట మునిగిన రహదారులపై, పొంగి పొర్లుతున్న వాగులు దాట కుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని, జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని ఆయన తెలిపారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 08743-232444 

నంబర్లకు కాల్ చేయాలని చెప్పారు. అలాగే ఫోటోలు, వీడియోలు పంపుటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9392919743 నంబర్ కు

 వాట్సప్ చేయాలని ఆయన ప్రజలకు సూచించారు. 

Share it:

Post A Comment: