CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించాలి

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

    సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమావేశంలో లో ఐ.ఎఫ్.టి.యు నాయకులు మంగీలాల్ డిమాండ్..

            తెలంగాణ సాధన ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షులు అంగొత్ మంగీలాల్ కోరారు,సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హైపవర్ కమిటీ వేతనాల అమలుకై తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ఏరియా లో నిర్వహిస్తున్న పోస్టుకార్డు ఉద్యమం లో భాగంగా బుధవారం సాయంత్రం సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో ఆయన సమావేశమయ్యారు తెలంగాణ సాధన తర్వాత ఖచ్చితంగా బతుకులు బాగు పడతాయని ఆశించిన సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు తాము ఆశించిన హైపవర్ కమిటీ వేతనాలు ఇంకా అమలుకు నోచుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని హైపవర్ కమిటీ వేతనాల లేక సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఈలోగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన వేతనాలు చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు, స్థానికంగా ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ప్రత్యేకించి కార్పొరేట్ వైద్యం , కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు 15 లక్షల ఎక్స్ గ్రేషియా, కరోనా సోకిన వారికి 14 రోజుల వేతనంతో కూడిన సెలవు,భీమా సదుపాయాల విషయంలో కూడా సింగరేణి యాజమాన్యం స్పందించాలని కోరారు, ఈ కార్యక్రమంలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సూపర్వైజర్లు రామ్ అవతార్, దొమ్మేటి సుధాకర్, సీనియర్ గార్డులు వై ప్రసాదరావు, డి వి రంగారెడ్డి, ఆర్ కె రాజు, ఎం రమేష్, ఎస్.కె నయీం పాషా, ఎస్.కె గఫార్, కె రమేష్, సాయి కుమార్, సుజిత్ పాల్, జయరాం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: