CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ తీర్మానం లేని కారోబార్ నియామకం ఆమోదయోగ్యం కాదు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో గ్రామ తీర్మానం లేకుండా కారోబార్ నియామకాం రహస్యంగా జరిగింది అని ఆ గ్రామానికి చెందిన బసకారి నాగార్జున పత్రికాముఖంగా తెలియజేసారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ ఈ విషయంపై కారోబార్ నియామకం కోసం దరఖాస్తు పెట్టుకున్న అభ్యర్థులను కారోబార్ గా కాకుండా వేరే వ్యక్తిని వ్యక్తిగతంగా నియమించుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈ విషయం పై గ్రామ పంచాయతీ సెక్రటరీని అడగ్గా నాకు తెలియదు మా పై అధికారులు నియమించారు అని సమాధానం ఇచ్చారన్నారు, ఎంపిడిఓ, ఎంపిఓ ను కలసి ఈ విషయం చెప్పి వివరణ అడగ్గా ఎంపిఓ మాకు తిమ్మంపేట గ్రామ పంచాయతీ నుండి కారోబార్ నియామకం గ్రామ సభ లో తీర్మానం ద్వారా ఒక వ్యక్తి ని నియమించినట్లు స్పెషల్ అధికారి సంతకంతో ఫైల్ నా దగ్గరకు వస్తే నేను ఆ ఫైల్ ను డి పి ఓ కు అప్రూవల్ కోసం పంపించాను అని వివరణ ఇచ్చారని తెలియజేసారు.. ఎటువంటి గ్రామ కమిటీ తీర్మానం జరగలేదు, గ్రామ సభ తీర్మానం లేకుండా తిమ్మంపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ ఏ విధంగా తీర్మానం చేసినట్లు, అసలు తీర్మానం జరగని ఫైల్ పై స్పెషల్ ఆఫీసర్ సంతకం ఎట్లా పెట్టారు,ఇవన్నీ సమగ్రంగా తెలుసుకోకుండా ఎంపిఓ డి యల్పి ఓ అప్రూవల్ కోసం ఎలా పంపించారు, అన్ని విషయాలు బహిరంగంగా తిమ్మంపేట లో సెప్టెంబర్ 16 న గ్రామ సభ పెట్టి జరగని గ్రామ సభలో, దరఖాస్తు చేయని అభ్యర్థి ఎలా నియామకం జరిగింది ఇందులో ఎవరికీ ఎంత ప్రమేయం ఉంది అన్ని విషయాలు ప్రజల ముందు బహిర్గతపర్చాలి, అందరి సమక్షంలో గ్రామ కమిటీ తీర్మానం ద్వారా కరోబార్ ను నియమించాలని లేదంటే ఈ సమస్య ను డిఎల్పీఓ,కలెక్టర్ ద్రుష్టికి తీసుకొనివెళ్తాము అని బసకారి నాగార్జున ఈ సందర్బంగా తెలియజేసారు.

Share it:

Post A Comment: