CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముక్కు పచ్చ లారని పసి పాప పై అత్యాచారం చేసిన మానవ మృగాన్ని వెంటనే ఉరితీయాలి-సురేష్ గుగ్గిళ్ల.

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా మహిళలకు రక్షణ లేదు, దళిత, గిరిజన మహిళలల మీద అఘాత్యాలకి కొదవలేదు ఎందుకు ఇంత వివక్ష మన చట్టాలు ఏమి చేస్తున్నాయి, మన రక్షణ యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు, మన పాలనా యంత్రాంగం, అధికారులు ఏమి చేస్తున్నట్లు, ఇంత క్రూరాతి క్రూరంగా, కర్కశంగా మనుషులు మానవ మృగాల్లా ఎందుకు తయారు అవుతున్నారు, ఎక్కడుంది లోపం... ప్రజల్లోనా, లేక పాలన లోన, న్యాయ వ్యవస్థ లోనా, మన రక్షణ వ్యవస్థ లోనా ఆలోచించండి, సమస్య పదే పదే పునరావృతం అవుతుంటే ఇంకా, దేశం లోని పాలకులు కండ్లు తెరవక పోతే ఎట్లా. మహిళల ఆగడాలపై, ఆరాచకాలపై, అకృత్యాలపై, మాన భంగాలపై దృష్టి పెట్టి ఆడపిల్ల ఒంటి మీద చేయి వేయాలంటేనే మానవ మృగాలు భయకంపితులయ్యేలా, అసభ్యంగా మాట్లాడే వాడే నాలుక తెగ కోస్తారేమో అని వణికిపోయేలా ఉండే చట్టాలను తీసుక రండి. లేదా ఉన్న చట్టాలకు పదును పెట్టి మీరు బద్ధకం వదిలి మహిళా లోకానికి రక్షణ కల్పించండి. ఒకటా రెండా ఎన్ని మానభంగాలు ఎంత అరాచకం,మహిళలకు రక్షణ లేదా అభివృద్ధి సాధిస్తున్నాము, దేశంలోనే మనమే భాగ్యవంతమైన రాష్ట్ర ప్రజలం అని చెప్పే తెలంగాణ లో ఇంత అరాచకం, ఇంత క్రూరత్వం పెరుగుతుంటే ప్రభుత్వానికి పట్టాదా ముక్కు పచ్చలారని పసి పిల్లపై అత్యాచారం చేసి చంపేస్తే తర్వాత వచ్చి పోలీసులు ఎలా జరిగింది అని ఆరాలు తీయడం తప్ప మీరు చేసే న్యాయం ఏదీ, ఇగనైనా ప్రభుత్వం మత్తు వదిలి మహిళల పై మానభంగాలు చేస్తున్న క్రూరులను వెంటనే ఉరి తీయాలని ఈ సందర్బంగా సురేష్ గుగ్గిళ్ల ప్రభుత్వాలను డిమాండ్ చేసారు.ఈ కార్యక్రమం లో గుండెట్టి జంపయ్య, యల్పి ఆదినారాయణ, బేత నరసింహారావు, యల్పి పున్నారావు,దాసరి శ్యాంబాబు,నెమలి నర్సయ్య, మంద రాజు, బుర్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: