CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు వ్యతిరేక చట్టాలును వెంటనే రద్దు చేయాలి -వామపక్షాలు

Share it:

 



 మన్యంటీవి, దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

దమ్మపేట మండలం,

దమ్మపేట లో భారత్ బంద్ లో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో బంద్ జరిగినది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు యార్లగడ్డగడ్డ భాస్కర్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అమర్లపూడి రాము, సిపిఎం నాయకులు మోరంపూడి శ్రీనివాసరావు, తెలుగుదేశం నాయకులు నాయుడు చెన్నారావు, కాంగ్రెస్ నాయకులు మద్దిశెట్టి సత్యప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును, కార్మిక చట్టాలను రద్దు చేయాలని 10 నెలలుగా రైతులు ఎండనకా వాననకా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్టుగా రైతులే కాదన్నట్టుగా వ్యవహరిస్తుందని, తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చెయ్యాలని, చేసే వరకు పోరాటాలు ఆగవని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో నరేంద్ర మోడీ పాలన, రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించి వరకు పోరాటం ఆగదని ప్రభుత్వాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు తంగెళ్ళమూడి శివ కృష్ణ, తండూరి వీరబాబు, బెజవాడ రవి, దొంగ లక్ష్మీ నారాయణ, శివ నారాయణ, ధర్మ, శ్రీను, సిపిఎం నాయకులు కార్యకర్తలు దొడ్డ లక్ష్మీనారాయణ, పిల్లి నాయుడు, కొప్పుల శ్రీను, బోగి నరసింహారావు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎండి వలి పాషా, ఉయ్యాల లక్ష్మీనారాయణ, గొల్లపల్లి చిరంజీవి, మౌలాలి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చిలక శ్రీను, డొక్క ప్రకాష్, చెవ్వ పోలయ్య, పానుగంటి రాంబాబు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వుకే అప్పారావు, బండి ఆదినారాయణ, కుర్సం ముత్యాలరావు, కాక వెంకటేశ్వరరావు, కేసరి వెంకటేష్, ఏఐటీయూసీ పంచాయతీ మండల అధ్యక్షుడు పందిటి చెన్నారావు, గొర్రెపాటి బసవయ్య, వల్లూరి రామకృష్ణ, పేరుమళ్ళరాంబాబు, తిమ్మరాజు, అన్నవరం, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: