CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయ్యాలి...

Share it:

 


"కాపు బందు" పధకం ప్రవేశపెట్టాలంటూ తహశీల్దార్ కు వినతి పత్రం...


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వెయ్యి కోట్ల రూపాయల నిధులతో మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయ్యాలని, మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా జూలూరుపాడు మండల కేంద్రంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం ప్రదర్శన గా తరలి వెళ్లి తాహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ లూధర్ విల్సన్ కు వినతి పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రోకటి సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం మున్నూరు కాపులు ఉన్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కులస్తులు వ్యవసాయమే జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. మున్నూరు కాపులు ఇతర రంగాలలో అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి "కార్పొరేషన్" ఏర్పాటు చేసి ఆర్థికంగా చేయూతను అందించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఎస్సీలకు దళిత బంధు ప్రకటించినట్టుగానే రాష్ట్రం లో అత్యధిక శాతం ఉన్న మున్నూరు కాపులకు "మున్నూరు కాపు బంధు" పథకం ప్రభుత్వం వెంటనే ప్రకటించి మున్నూరు కాపు లను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. మున్నూరు కాపు కుల ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో నిబందనలు సడలించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం మండల కోశాధికారి బాపట్ల మురళి, నాయకులు బొడ్డు కృష్ణయ్య, మల్లెల నాగేశ్వరరావు, పుప్పాల నరసింహారావు, శిరంశెట్టి రామారావు ,తోట శ్రీనివాసరావు, రామిశెట్టి నాగేశ్వరరావు, వడ్డే వెంకటనారాయణ, పాశం వెంకటేశ్వర్లు, మద్దిశెట్టి ప్రకాష్, పాలెపు భద్రయ్య, ఉసికల కృష్ణయ్య ,మద్దిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: