CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శారదక్క లొంగుబాటు..!!

Share it:

 


సీపీఐ మావోయిస్టు పార్టీ అజ్ఞాతదళనేత *జేజ్జరి.సమ్మక్క అలియాస్ శారదక్క* లొంగిపోయారనే వార్త మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది. గంగారం మండల కేంద్రానికి చెందిన శారదక్క అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కార్యకలాపాలకు ఆకర్షితురాలై 1994 లో అజ్ఞాతం లోకి వెళ్లారు. *గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ నేతృత్వం లోని పాండవదళంలో సభ్యు రాలిగా 1994 లో అజ్ఞాత జీవితం ప్రారంభించిన శారదక్క పార్టీలోనే హరిభూషణ్ ను అజ్ఞాతం లొనే పెళ్లి చేసుకున్నారు.* అయితే అనారోగ్య కారణాలతో 2009 లో లొంగిపోయిన శారదక్క కు ప్రభుత్వం ఆమెపై ఉన్న రివార్డు 4 లక్షల రూపాయలను అప్పట్లో అందచేసింది నిరుపేద కుటుంబానికి చెంది శారదక్క అజ్ఞాతంలో వుండగానే ఆమె తండ్రి సోదరుడు మరణించడం తో వృద్ధురాలైన తల్లి మేనల్లుడు తో కలిసి జీవనం సాగించేది. తల్లి మేనల్లుడు ఉండడానికి సరైన ఇల్లు లేకపోవడం తో తాను లొంగిపోగా వచ్చిన రివార్డు డబ్బులతో వారికి గంగారంలో పక్కా ఇల్లు నిర్మించింది. శారదక్క లొంగి పోయినప్పటికీ ఆమె భర్త హరిభూషణ్ మావోయిస్టుపార్టీ లోనే కొనసాగారు. *శారదక్క లొంగిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలు స్వగ్రామమైన గంగారం లో సాదారణ జీవితం గడిపినప్పటికి. తిరిగి 2012 లో అజ్ఞాతం లోకి వెళ్లి పోయింది.* ఈ క్రమం లో హరిభూషణ్ మావోయిస్టుపార్టీలో కేంద్రకమిటి సభ్యుడిగా ఎదగడంతో పాటు రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే అనూహ్యంగా *హరిభూషణ్ కరోనా బారిన పడి మరణించారు..* అప్పట్లో హరిభూషణ్ తో పాటు శారదక్క కూడా మృతి చెందిదనే వార్తలు వచ్చాయి. శారదక్క మృతి చెందలేదంటూ పార్టీ ప్రకటించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం పోలీసుల ముందు శారదక్క లొంగి పోయిందనే వార్త తెలుసుకున్న ఆమె తల్లి, మేనల్లుడు ఆనందం వ్యక్తపరిచారు.

Share it:

Post A Comment: