CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉చైత్ర హత్య నిందితుడిని కఠినంగా శిక్షించాలి..

Share it:


👉రాష్ట్రం లో చైత్ర చట్టం తెచ్చి , ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నెల రోజుల్లో దోషి ని శిక్షించాలి...

👉సేవ్ క్రియేషన్ జిల్లా ప్రసిడెంట్ సాదిక్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 14 (మన్యం టీవీ) హైదరాబాద్ లో ఆత్యచారానికి గురై అశూవులు బాసిన ఆరేళ్ల చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి కలగాలని, చైత్ర దోషులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు లో విచారణ జరిపి నెల రోజుల్లో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సేవ్ క్రియేషన్(విసియఫ్) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం సింగరేణి కార్మిక ప్రాంతం అయిన రుద్రంపూర్  లో పిస్ ర్యాలీ నిర్వహించారు. సేవ్ క్రియేషన్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్, రుద్రంపూర్ ఎంపీటీసీ-3 ఆర్తి మక్కడ్  ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం సేవ్ క్రియేషన్ జిల్లా అధ్యక్షులు యండి. సాదిక్ పాషా పాల్గొని ప్రసంగించారు. దేశం లో మహిళల రక్షణ కోసం, పసి పిల్లల పై అగహిత్యలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చట్టలు, శిక్షలు అమలు లో ఉన్నాయని, అయిన సరే ఇలాంటి అగహిత్యలు జరగడం నిజంగా సభ్యసమాజం సిగ్గు పడే పరిస్థితి ఉందని సాదిక్ పాషా అభిప్రాయపడ్డారు. చట్టంపై సరైన అవగాహన లేక పోవడంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నయని, పోక్సో యక్ట్ 2012 ను సవరిస్తు ప్రస్తుతం ఉన్న శిక్షలతో పాటు 12 సంవత్సరాల లోపు బాలికలపై ఆఘయిత్యలు చేసి ప్రాణాలు తీస్తే వారికి ఉరిశిక్ష వేసే విధంగా చట్టం ను సవరించారని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో దిశ చట్టం లాగ తెలంగాణ రాష్ట్రం లో చైత్ర చట్టం తెచ్చి ఇలాంటి దాడులు చేసే దోషులను నెల రోజుల్లో శిక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయలని సాదిక్ పాషా ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తునే ఆడ పిల్లలకు స్కూల్ స్థాయి నుండే సేల్ఫ్ డిఫెన్స్ క్లాసులు ప్రారంభించాలని, ఆడ పిల్లలు ఎవరి మీద ఆధారపడకుండా తమను తాము కాపాడుకునే ల ఆడ పిల్లలను, మహిళలను ప్రభుత్వం శిక్షణ ఇప్పించాలని సాదిక్ పాషా డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు భాథ్యతగా సమాజం పట్ల, బయట మహిళల పట్ల ఏలా ఉండాలో అనే విషయం తమ మగ పిల్లలకు నేర్పాల్సిన భాథ్యత తల్లిదండ్రులదే అని అన్నరు. మనుషుల ఆలోచనలో మార్పు రానంత కాలం ఎన్ని చట్టాలు చేసిన ఉపయోగం ఉండదని, సమాజంలో ప్రతి సాధారణ పౌరులు కుడా యునిఫాం లేని పోలీస్ యే అని, మన ముందు జరుగుతున్న ఎలాంటి ఆఘయిత్యలైన, దాడులనైన అపే ప్రయత్నం చేయలని ప్రజలకు పిలుపునిచ్చారు. పోక్సో యక్ట్ ద్వారా దోషులకు పడే శిక్షలపై ఆవగాహన లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నయని, సేవ్ క్రియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో షి టీం, పోలీస్ శాఖలను సమన్వయం చేస్కుంటు జిల్లా వ్యాప్తంగా సేవ్ క్రియేషన్ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సులు నిర్వాహిస్తామని సాదిక్ పాషా తెలిపారు. చైత్ర కుటుంబన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సాదిక్ పాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ క్రియేషన్ భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ సాదిక్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఆర్తీ మక్కడ్,  జోగు భాస్కర్,  పి ఆర్ ఓ జోగు కళ్యాణి, కోశాధికారి పుష్పలత, చుంచుపల్లి మండల ప్రెసిడెంట్ కల్యాణి, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ,  అధికార ప్రతినిధి మాచర్ల ప్రదీప్, పి ఆర్ ఓ వాసల మురళి, మండల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్స నివాస్ నాయక్, మోతి హరిప్రసాద్, ఎల్..ప్రసాద్ ,ఎంపీటీసీ రుక్మిణి,టివిపిఎస్ సతీష్ గుండపునేని,నాగేశ్వర్ రావు, సర్పంచ్ సాగర్, రాందాస్ ,జమాతే ఇస్లామ్ హింద్ మెంబర్స్ భాషీద్, ఫాతిమా, గౌతంపూర్ సేవ సెక్రెటరీ అనిత,శంకర్, మహేష్, నాగమణి,     వి .శ్రీ హర్షిని ,షణ్ముఖ ప్రియా, ఉపసర్పంచ్లు షాహీన్, రవి, వార్డుమెంబెర్స్, గ్రామప్రజాలు,  తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: