CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవి బిడ్డల జోలికి వస్తే ప్రభుత్వానికి పతనం తప్పదు..

Share it:

 


                                                                        కొత్తగూడెం లో జరిగే పోడు రైతాంగ పొలికేక సదస్సును జయప్రదం చేయండి..

                                           మండలంలోని రాంపురం, ఎలకలోడ్డు పోడు భూముల ను సందర్శించిన సిపిఐ వైరా డివిజన్ నాయకురాలు భానోత్ విజయ్ భాయ్...


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 28, ఎన్నో సంవత్సరాల కాలంగా అడవిని నమ్ముకొని తల్లిలాంటి అడివి తో అనుబంధాన్ని పెంచుకుని చెట్టును, పుట్టను నమ్ముకుని పోడు సాగు దారు జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీ గిరిజనుల భూములను హరితహారం పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని, పోడు సాగు దారులకు సిపిఐ అండగా ఉంటుందని, వైరా నియోజకవర్గ నాయకురాలు భానోత్ విజయ బాయ్ తెలిపారు. మంగళవారం మండలంలో పోడు సందర్శన యాత్ర నిర్వహించారు. పోడు సాగు దారులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని 2006లో అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయ్యాలని, పోడు రైతుల పై నిర్బంధాలకు స్వస్తి చెప్పాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకను నొక్కి వేసే ప్రయత్నం జరుగుతుందని, పోడు సాగు దారులను ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వం బెదిరిస్తూ అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో హరితహారం పేరుతో పంట భూములు లాక్కొని మొక్కలు నాటుతున్నరని, తెలంగాణలో పోడు సాగు దారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. చరిత్రలో ఎంతోమంది పాలకులు హిట్లర్, బ్రిటిష్, నైజాం పాలకులను పారదోలిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకు ఉందని హెచ్చరించారు. రేపు ఉదయం 10 గంటలకు కొత్తగూడెం క్లబ్ లో పోడురైతు పొలికేక సదస్సు జరుగుతుందని, ఈ సదస్సులో పెద్ద ఎత్తున పోడు రైతుల పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సిపిఐ వైరా డివిజన్ మాజీ కార్యదర్శి చండ్ర నరేంద్ర కుమార్, ఎల్లంకి మధు, చింత స్వరాజ్యరావు, షేక్ నాగుల్ మీరా, కొండ వీరయ్య, భానోత్ రాజు,

మాడి నాగేశ్వరరావు, మాలోత్ వెంకట్రామ్, గూగుల్లో దేవి, బానోత్ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: