CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్మిక గర్జన పాదయాత్ర బృందాన్ని అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఇల్లందు సీఐటీయూ అధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్దం

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీఐటీయూ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఈ నెల 8నుండి కార్మిక గర్జన పాద యాత్రను పోలీసుల అనుమతితో నిర్వహిస్తుండగా వేల మంది కార్మికులు ఈ పాదయాత్రలో పాల్గొని తమ గోడును విన్న వించుకుంటుండ గా ప్రభుత్వానికి మింగుడు పడక కేంద్ర మంత్రి పర్యటన ఉన్నదని యాత్ర బృందాన్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరిలించి పాదయాత్ర ను భగ్నం చేశారు.దీనికి నిరసనగా ఇల్లందు సీఐటీయూ కమిటీ అధ్వర్యంలో లో ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక మార్కెట్ సెంటర్ లో దగ్దం చేశారు. అనంతరం జరిగిన సభలో సీఐటీయూ ప్రాంతీయ సమన్వయ కమిటీ కన్వీనర్ అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ. .కేంద్ర ప్రభుత్వం 44కార్మిక చట్టాలను రద్దు చేసి 4కోడ్ లు తెచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మెస్తూ కార్మికులను రోడ్ల పాలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో వెట్టి చాకిరీ చేస్తున్నదని కార్మిక సమస్యల పరిష్కారం కోసం,కార్మిక వర్గాన్ని జాగృత పరిచేందుకు ప్రభుత్వ అనుమతితో శాంతియుతంగా కార్మిక గర్జన పాదయాత్ర చేస్తుంటే బృందాన్ని అకారణంగా అరెస్టు చేయడం అమానుషమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలేటి కిరణ్ కుమార్, తాళ్లూరి కృష్ణ, సుల్తానా, ఆలేటి సంధ్య,ఐద్వా నాయకులు జైబున్నిస, అఫ్సర్,తాళ్లూరి పద్మ,లక్ష్మీ,బోయిన పద్మ, లక్ష్మణ్ పాసి, ఆవాజ్ నాయకులు జాఫర్, జమీల్ పాషా, రాము పాసి,సత్యనారాయణ కోరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: