CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నీట మునిగిన పంటలకు నష్ట పరిహారం అందించాలి

Share it:

 


సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

గత కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కు నీట మునిగిన, ఇసుక మెటలు వేసిన పొలం గల రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలని సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్ చేశారు.ఆదివారం తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో గల జంపగవాయి శివారు రైతుల పంట పొలాలను పరిశీలించారు.అనంతరం సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరదలు రావడం తో వందలాది ఎకరాల పంట నష్టం జరిగింది అని వెంటనే రైతులకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి అని,మేడారం జాతర ముందు కమిషన్ల కోసం హడావుడి చేసే ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదని,జడ్పీటీసీ ని గెలిపిస్తే మండలం ని దత్తత తీసుకొని అందుబాటులో ఉంటా అన్న మంత్రి దయాకర్ రావు కనిపించడం లేదని,దత్తత తీసుకోవడం అంటే మండలాని గాలికి వదిలేయడమా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పంట నష్టం జరుగుతే నష్ట పరిహారం ఇచ్చేది అని,తెరాస వచ్చినాక రైతులను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తుంది అని తెరాస పని అయిపొయింది అని త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనిఅన్నారు.ఇప్పటికి అయినా నష్ట పరిహారం ఇవ్వకపోతే తహసీల్దార్ ఆఫీస్ ముందు రైతులతో కలిసి నిరసన తెలుపుతాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పురుషోత్తం నరసింహులు,దుబాసి సుధాకర్,రాంరెడ్డి,నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: