CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులను ఇబ్బంది పెడుతున్న బ్యాంక్ అధికారులు

Share it:

 


*పట్టించుకోని ప్రభుత్వం.

*చెప్పేది ఒకటి చేసేది మరొకటి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు చిట మట రఘు మాట్లాడుతూ రైతులకు క్రాప్ లోన్ లు ఇచ్చి ఆదుకోవాలి.పంటలకు పెట్టుబడిగా రైతు దగ్గర ఉన్న పాస్ బుక్కులను బ్యాంకుల్లో పెట్టి క్రాప్ లోన్ లు ఇచ్చేవారని,ఇప్పుడు అన్ని బ్యాంకులలో కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,పంజాబ్ నేషనల్ బ్యాంక్,ఏపీ జివిబిఎస్ బ్యాంక్ లలో క్రాప్ లోన్ లు ఇవ్వడం లేదని వెంటనే కలెక్టర్ స్పందించి బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులను ఆదుకోవాలని అన్నారు.అదేవిధంగా వరి, మిర్చి నారు నటే సమయం కాబట్టి రైతులకు పెట్టుబడులకు డబ్బులు ఎక్కువ అవుతాయి,కాబట్టి బ్యాంకులో కాకుండా ప్రైవేటుగా డబ్బులు వడ్డీకే తేస్తే వడ్డీ డబ్బులు ఎక్కువ ఉంటాయి.కాబట్టి బ్యాంక్ నుండి,క్రాప్ లోన్ కింద డబ్బులు పెట్టుబడి సాయం తీసుకుంటే 80 పైసలు నుండి 1 రూపాయి వరకు పడుతుంది అని అన్నారు.రుణమాఫీ అన్న కాలం నుండి బ్యాంకులు కూడా రైతులకు లోన్స్ ఇవ్వడం లేదని అన్నారు.కానీ రైతులకు మాత్రం ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదని అన్నారు.దీనివల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కలెక్టర్ స్పందించి బ్యాంకు అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.స్టేట్ బ్యాంకు అధికారులు వన్ ఇయర్ నుండి క్రాప్ లోన్స్ కొరకు అప్లికేషన్ పెట్టిన రైతులను బ్యాంక్ ల్లో డాక్ మెంట్స్ పెట్టుకున్నారు. కానీ బ్యాంకు అధికారులు ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వెంటనే వారికి క్రాప్ లోన్ లు ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,జిల్లా ఎస్టి సెల్ జిల్లా నాయకుల దబ్బాకట్ల సత్యనారయణ,యూత్ మండల అధ్యక్షలు వసంత శ్రీనివాస్,ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు చేల వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: