CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో విస్తృత పర్యటనా చేసిన ఎంపీపీ

Share it:

 



*వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలనూ తెలుసుకుంటున్న ఎంపీపీ


*ఏ ఇబ్బంది వచ్చిన నేనున్నాను ఎంపీపీ


*వర్షాల వల్ల ఎవరికి ఏ ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయండి ఎంపీపీ


*రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎంపీపీ


*అధికారులు ఎప్పటి కప్పుడు గ్రామాలను పర్యవేక్షిస్తూ వుండాలి ఎంపీపీ


*ఎవరూ కూడా నీటి ప్రవాహాల దగ్గరకు వెళ్ళవద్దు, సెల్ఫి లు చేపలు అనీ ఎవరు కూడ సాహసాలు చేయవద్దు.


 మన్యంటీవి, అశ్వారావుపేట; రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అశ్వారావుపేట మండలం లోని పలు గ్రామాలను వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి విస్తృత పర్యటన చేశారు. నారాయణపురం గ్రామంలో వర్షానికి వరద నీరు రెండు ఇళ్లలోకి రావడంతో వారిని పరామర్శించి వెంటనే వారిని నారాయణపురం రైతు వేదిక కేంద్రం లో పునరావాసం కల్పించారు, అలాగే నారాయణా పురం పంచాయతీ వారు వారికి భోజనాలను ఏర్పాటు చేపించారు. వినాయకపురంలో అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థలో వున్నందున వాటిని పరిశీలించారు. అనంతరం గుమ్మడివల్లి ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు రావడంతో 5 మీటర్ల ఎత్తు వరకు నీరు నిల్వ ఉంచి మిగిలిన నీటిని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు, ఈ సంధర్భంగా గుమ్మడవల్లి ప్రాజెక్ట్ ను సందర్శించి ప్రాజెక్ట్ సామర్థ్యాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గుమ్మడి వల్లి నుండీ కోయి రంగాపురం వెళ్లే రహదారి మీద వరద విదృతి ఎక్కువగా ఉండడంతో రోడ్డు ఎవరు దాటకుండా కంచే కట్టించిచరు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు ఎంపీడీఓ విద్యాధర రావు, పిఆర్ ఏఈ శ్రీనివాసరావు, నారాయణపురం రైతు కమిటీ మెంబర్ చిన్నం శెట్టి వెంకట నరసింహం, జక్కుల రాంబాబు, ప్రాజెక్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: