CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కాళోజీ స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచి

Share it:

 


👉తెలంగాణ భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కొత్తగూడెం మునిసిపల్ కార్యాలయంలో కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన మునిసిపల్ చైర్పర్సన్ కాపుసీతాలక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కాళోజీ తెలంగాణ భాష యశా స్ఫూర్తి. తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచరాన్నారు."పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది" అని నినదించిన కాళోజీ జీవితమంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందని తెలంగాణ తొలి ఉద్యమకారులలో ఒకరని వారు రాసిన ప్రతి కవిత్వం తెలంగాణ ప్రజల గొంతుక అని అన్నారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ అఫ్జలున్నిసా బేగం, మున్సిపల్ కమిషనర్ అరికల సంపత్ కుమార్, మేనేజర్ సత్యనారాయణ, రవిచంద్ర, ఆర్ఐ ప్రసాద్,ఫయాజ్, సలీం, గాయత్రి, మెప్మా,మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: