CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉కొత్తగూడెం ఏరియా లో ప్రజా కవి శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలు.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) కొత్తగూడెం ఏరియా పరిధిలోని  జి‌ఎం కార్యాలయము  నందు ప్రజా కవి, స్వాతంత్ర సమరయోధుడు మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడయిన కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  కొత్తగూడెం ఏరియా జి‌ఎం సి‌హెచ్.నరసింహా రావు ముందుగా కాళోజీ నారాయణ రావు చిత్ర పటానికి పూలమాలతో  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భముగా జి‌ఎం సి‌హెచ్ నరసింహా రావు మాట్లాడుతూ కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను జరుపుకోవటం చాలా సంతోషకరం అని కాళోజీ నారాయణ రావు స్వాతంత్ర మరియు తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నారని  కవిత్వం వ్రాసిన ప్రజాకవి అని ఆయన పుట్టిన రోజుని తెలంగాణప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించారని మరియు భారత ప్రభుత్వం ఆయన చేసిన సేవలకు గాను1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ తో సత్కరించారుఅని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జిఎం సిహెచ్ నరసింహారావు, ఎస్‌ఓటు జి‌ఎం రమేశ్, ఏరియా ఇంజనీర్ వై.రఘు రామి రెడ్డి, డి‌జి‌ఎం ఐ‌ఈ ఉజ్వల్ కుమార్ బెహ్రా, వైస్ ప్రెసిడెంట్ బుడగమ్ రామ కృష్ణ,  ఇంచార్జ్ డి‌జి‌ఎం పర్సనల్ డి.కిరణ్ బాబు, ఎస్‌ఈ ఈ&ఎం పర్చేస్ బుల్లి మాధవ్, పిట్ సెక్రటరీ శేఖర్, సేవా కొ ఆర్డినేటర్ సాగర్ మరియు జి‌ఎం కార్యాలయ సిబ్బంధి పాల్గొన్నారు.

Share it:

Post A Comment: