CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విద్యాసంస్థల్లో శానిటేషన్ చేయాలి

Share it:

 



 *ప్రభుత్వ వసతి గృహాలు తెరవటంలో అలసత్వం ఎందుకు 


 *ప్రైవేటు ఉపాధ్యాయులకు దిక్కెవరు


 *ఫీజు రియంబర్స్ మెంట్ లేక మూసివేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలు


 విద్యార్థి యువజన సంకల్పన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల సందర్శన కార్యక్రమం మొదటిరోజు స్థానిక వి వై ఎస్ ఎస్ కార్యాలయం నుండి ప్రారంభించి ప్రభుత్వ జూనియర్ కళాశాల,ప్రభుత్వ ఉన్నత పాఠశాల,సిద్దార్థ ఓకేషనల్ కళాశాల,వాహిని కళాశాల,సాయి డిగ్రీ కలశాల బీసీ బాలుర వసతి గృహాలను సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా వి వై ఎస్ ఎస్ వ్యవస్థాపకులు గుమ్మడి రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1 వ తేదీన ప్రారంభమైన విద్యాసంస్థల్లో మొదటి రోజు మాత్రమే శానిటేషన్ చేసారు మళ్ళీ ఈరోజు వరకు కూడా శానిటేషన్ లేదు పారిశుద్ధ్య పనులు లేక విద్యార్థులు మరియు ఉపాద్యాయులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు,మరోపక్క ప్రైవేటు విద్యాసంస్థల పరిస్థితి అయితే ఫీజులు రాక,ఫీజురియంబర్స్ మెంట్ లేక విద్యార్థులు పూర్తిస్థాయిలో విద్యాసంస్థల కు రాక పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తక్షణమే విద్యాశాధికారులు స్పందించి విద్యారంగ సమస్యలతో బాధపడుతున్న ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థలకు న్యాయం చేయాలని మరియు ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వ మే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వి వై ఎస్ ఎస్ నాయకులు రమణ,భరత్,శివ,క్రాంతి,ప్రవీణ్,సాయి,వెంకటకృష్ణ,కిరణ్,మణికంఠ,నవీన్ తదితరులు పాల్గొన్నారు*

Share it:

Post A Comment: