CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం చాటిన నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకటముత్యం

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణం ఏఎస్ఆర్ నగర్ కు చెందిన సెల్ రిపేర్ మెకానిక్ వెంకటరమణ (బబ్లూ) ఇటివల రోడ్డు ప్రమాదానికి గురికావడంతో కాళ్లు చేతులలో పట్టు కోల్పోయి మంచానికే పరిమితం అయ్యాడు. దీంతో వెంకటరమణ కుటుంబం పోషణ, వైద్య ఖర్చులతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని పత్రికా కథనం ద్వారా తెలుసుకొని చలించిపోయిన నారంవారిగూడెం సర్పంచ్ మనుగొండ వెంకటముత్యం (పెద్దోడు) ఏఎస్ఆర్ నగర్లోని వెంకటరమణ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు నగదు, పాతిక కేజీల బియ్యంను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల సత్యనారాయణ, రవి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: