CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షెడ్యుల్ ఏరియా లో జీఓ 68 ప్రకారం వైద్య శాఖ ఉద్యోగాలు భర్తీ చెయ్యాలి

Share it:

 


*ఆదివాసుల కు న్యాయం చేయకుంటే పోరాటాలు ఉదృతం చేస్తాం...

*జిల్లా అధికారులు స్పందించాలి,తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో కొమరం బీమ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన  జిల్లాలో భర్తీ చేయనున్న స్టాప్ నర్స్ ఉద్యోగాలపై తుడుందెబ్బ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ,తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మరియు నేషనల్ హెల్త్ మిషన్ నుండి 26/03/2021 న వెలువడిన నోటిఫికేషన్ లో ములుగు జిల్లా ఐటీడిఎ ఏటూరు నాగారం పరిధిలోని షెడ్యుల్  ప్రాంతం లో, స్టాప్ నర్సు -11,లాబ్ టెక్నీషియన్ -3  పార్మ సిస్ట్ -3.ANM /MPHA (f) -49.  ఉద్యోగాలు, జీఓ నెంబర్ 68 ప్రకారం, షెడ్యుల్ ప్రాంత  ఉద్యోగాలు భర్తీ చేయాలని పేర్కొన్న, దీనిని ఉల్లంఘించి ములుగు జిల్లాలో ఆదివాసీలకు అన్యాయం చేయటానికి, జనరల్ అభ్యర్థుల చేత ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని,జిల్లా యంత్రాంగం కుట్రలు చేస్తున్నారని దీనిని ముమ్మాటికీ సహించేది లేదని అన్నారు.5వ షెడ్యుల్ ప్రాంతం లో ఉద్యోగాలు,కేవలం షెడ్యుల్ ట్రైబల్ చేతనే భర్తీ చేయాలని స్పష్టంగా ఉన్న ,జిల్లా యంత్రాంగం ఎందుకు విస్మరిష్టుంది సమాధానం చెప్పాలి అన్నారు.ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్స్ పుల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ 17/7/2010 లో, విడుదల చేసిన సర్క్యులర్ నిబంధనల ప్రకారం, షెడ్యుల్ ఏరియా లో 22 శాఖల లో షెడ్యుల్ ట్రైబల్ చేత భర్తీ చేయాలి అని ఉంది.దానిలో జీఓ నెంబర్ 68,16/4/1988 నీ అనుసరించి వైద్య ఆరోగ్య శాఖ లో,షెడ్యుల్ ట్రైబల్ అభ్యర్ధులను నోటిఫికేషన్ ద్వారా సెలక్ట్ చేసి,జీఓ నెంబర్ 24,12/06/2018 తెలంగాణ ప్రకారం డిస్ట్రిక్ట్ లెవల్ స్క్యూట్నీ కమిటీ(DLSC) జరిపిన తరువాత నే స్టాప్ నర్స్ ఉద్యోగాలు భర్తీ చేయాలి.కానీ నేడు నిబంధనలు విరుద్ధంగా అక్రమ పద్ధతిలో నియామకాలు జరుపుతున్నారని అన్నారు. మొదటగా షెడ్యుల్ ట్రైబల్ అభ్యర్థులు,అర్హులు అని పత్రిక ప్రకటన,నోటిఫికేషన్ ఇచిన జిల్లా వైద్య శాఖ మళ్లీ తిరిగి జనరల్ అభ్యర్దులు కూడా అర్హులు అని రెండో సారి నోటిఫికేషన్ ఈవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు.సుప్రీం కోర్టు లో రివ్యూ పిటీషన్ విచారణలో ఉన్న జీఓ నెంబర్ 3 కేవలం ఉపాధ్యాయ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది అని అన్నారు.వైద్య శాఖ జీఓ 68 ఇంకా అమలు లోనే ఉంది.అన్న విషయం కూడా తెలవని అంతా అజ్ఞానం లో జిల్లా యంత్రాంగం ఉంది అని ఎద్దేవా వేశారు.ఖమ్మం జిల్లాలో ఇదే నోటిఫికేషన్, స్థానిక షెడ్యుల్ ట్రైబల్ అభ్యర్థుల చేతనే భర్తీ చేశారని,మీరెలా జనరల్ అభ్యర్థుల చేత భర్తీ చేస్తారని ప్రశ్నించారు.ములుగు జిల్లా లో పూర్తిగా ఏజెన్సీ చట్టాలకు జివొలకు వ్యతిరేకంగా ఉద్యోగాల నియమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ పక్రియనీ నిలిపి వేసి ఆదివాసీలతో  భర్తీ చేయాలని, కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న ఆదివాసీ అభ్యర్థులకు ప్రాతి నిత్యం కల్పించాలి అని అన్నారు.దీని పై జిల్లా కలెక్టర్ స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలి అన్నారు. లేని యెడల రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ని ఆశ్రయించ నున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్, నాయకులు పాయం పూర్ణ చందర్,తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఏట్టి ప్రకాష్, సనప నరేష్,చేర్పరవి తది తరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: