CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్టోబర్ 5న జరిగే సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..

Share it:

 


అఖిలపక్ష పార్టీ ఆదివాసి సంఘం నాయకులు పిలుపు..



మన్యం టివి దుమ్ముగూడెం సెప్టెంబర్ 30: మండల కేంద్రం లో అఖిలపక్ష పార్టీలు ఆదివాసీ సంఘాలు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ వచ్చే నెల అక్టోబర్ 5వ తేదీన జరిగే సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసులు తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని వారిపై పెట్టినటువంటి పోలీస్ ఫారెస్ట్ అక్రమ కేసులు ఎత్తివేయాలని ఆదివాసుల పైన ఫారెస్ట్ దాడులు ఆపాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 5న జరిగే ఈ సడక్ బంద్ కార్యక్రమం లక్ష్మీ నగరం సెంటర్లో జరుగుతుందని ఈ కార్యక్రమానికి వేలాది మంది ఆదివాసీలు కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులు సాగుచేస్తున్న భూముల పరిష్కారం కోసం సమన్వయ కమిటీ ముగ్గురు మంత్రులతో ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీ విధివిధానాలు ప్రకటించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆదివాసులకు హక్కు పత్రాలు రావడంలేదని ఈ పాలకుల వెన్నులో వణుకు పుట్టాలి అంటే అక్టోబర్ 5న జరిగే సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఇంకా ఎంతకాలం ఈ పోరాటాలు ఈ ఉద్యమాలు ఈ సడక్ బంద్ లో తాడోపేడో తేల్చుకోవాలని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, సిపిఐ పార్టీ నాయకులు నోముల రామి రెడ్డి ,తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొమరం దామోదరరావు ,కేలా వేణు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్శి సాంబశివరావు ,ఎమ్మెల్యే డెమోక్రసీ పార్టీ నాయకులు సున్నం వీరభద్రం, ఏ బి ఎస్ పి రాష్ట్ర నాయకులు సోయం కామరాజు ,గిరిజన సమైక్య నాయకుడు వరస గౌరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ, కొరస చిలకమ్మా సిపిఐ నాయకులు తాటిపూడి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని నారాయణమూర్తి ,ఏ వి ఎస్ పి నాయకులు సోందే మల్లు దొర, ఎండి పార్టీ నాయకులు దాసరి సాయన్న ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: