CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

29న జిల్లా కేంద్రంలో జరగబోయే అఖిలపక్ష పార్టీ సదస్సును జయప్రదం చేయ్యాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పిలుపు..

Share it:

 



👉 పోడు భూములకు పట్టాలివ్వాలని అక్టోబర్-5 జాతీయ రహదారుల దిగ్బంధంకు పిలుపు..


మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబర్ 28, హరితహారం పేరుతో పోడు సాగు దారులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులను నిలుపుదల చేయాలని, సెప్టెంబర్ 29న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే సదస్సు ను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయ్యాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటుతు పోడు భూములను బలవంతంగా లాక్కొంటుందని, ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు రైతుల పై ఫారెస్ట్ అధికారులతో టిఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చెపిస్తుందని, వెంటనే ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని డిమాండ్ చేసారు.

పోడు రైతుల దగ్గర నుండి భూములు లాక్కుని ఖనిజ సంపద కార్పొరేట్ కంపెనీలకు అప్ప చెప్పేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, ఎన్నికల ముందు పోడు రైతులకు పట్టా హక్కులు కల్పిస్తామని వాగ్దానం చేసి, ఈరోజు ముఖ్యమంత్రి ఫారెస్ట్ అధికారులతో రైతులపై దాడులు చేపించడం దారుణం అని, ఇప్పటికైనా ప్రభుత్వం పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులందరికి పట్టా హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగం ప్రకారం గిరిజన హక్కులను కాపాడేందుకు ఉన్న చట్టాల ప్రకారం పోడు వ్యవసాయం చేసుకునే హక్కు గిరిజనులకు వుందని అన్నారు. గిరిజన ఎమ్మెల్యేలు, ట్రైబల్ అడ్వ్యజర్ కమిటీ లో తీర్మానం చేసి పేదగిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేయ్యాలని ఆయన డిమాండ్ చేసారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, గిరిజనేతర పేదలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రబుత్వం రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గోపాలరావు, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి సురేందర్, పివైయల్ జిల్లా నాయకులు రాయల సిద్దు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: