CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి పోస్టర్ల ఆవిష్కరణ...

Share it:


👉అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు , ఆదివాసీ సంఘాలు పిలుపు...


మాన్యం టివి దుమ్ముగూడెం:

ఈరోజు దుమ్ముగూడెం మండలం లో ములక పాడు సెంటర్ లో సిపిఎం,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, తెలుగుదేశం, ఏ వి ఎస్ పి, సి ఐ టి యు, వ్యవసాయ కార్మిక సంఘం, ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు కేచ్చల రంగారెడ్డి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కొమరం దామోదరరావు ఏ వి ఎస్ పి రాష్ట్ర నాయకులు సోయం కామరాజు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పిలక వెంకటరెడ్డి సిఐటియు జిల్లా నాయకురాలు జి పద్మ మాట్లాడుతూ ఈనెల సెప్టెంబర్ 27న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి అని మోడీ ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు నూతన విద్యుత్ బిల్లు రద్దు చేయాలని వ్యవసాయ పంటల అన్నిటికీ కనీస మద్దతు ధరల కు చట్టబద్ధత హక్కు ఇచ్చే చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ వారు మాట్లాడటం జరిగింది అలాగే కార్మికవర్గ హక్కులను కాలరాసే వెజ్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని ఆదివాసులు తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి అని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని వారు ఈ సందర్భంలో ప్రభుత్వానికి గుర్తు చేశారు నిత్యవసర వస్తువులు సరుకుల ధరలను వంట గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని అలాగే వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ నెల సెప్టెంబర్ 27న జరిగే భారత బందుకు వ్యాపార వర్గాలు ఉద్యోగస్తులు కాంట్రాక్టు ఉద్యోగస్తులు రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర బిజెపి పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైతు సంఘం మండల అధ్యక్షులు ఎలమంచి శ్రీనుబాబు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎలమంచి వంశీకృష్ణ ఏ వి ఎస్ పి డివిజన్ నాయకులు సోందే మల్లు దొర ఎమ్మెల్ పార్టీ డివిజన్ నాయకులు సాయన్న తెలుగుదేశం పార్టీ మండల నాయకులు వేణు, సిపిఐ పార్టీ డివిజన్ నాయకులు రామ్ రెడ్డి సి ఐ టి యు మండల కన్వీనర్ కొరస చిలకమ్మా తెల్లం ధర్మయ్య సున్నం వీరభద్రం ఇంకా తదితరులు పాల్గొన్నారు..

Share it:

Post A Comment: