CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 11వ తేదీన ఖమ్మంలో జరుగు బహుజన సదస్సును జయప్రదం చేయండి.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 9 (మన్యం టీవీ): ఈనెల 11న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టరు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఖమ్మం వస్తున్నారని బహుజనులంతా వేలాదిగా పాల్గొని బహుజన సదస్సు సభను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల ఆశయసాధనకోసం బహుజన రాజ్య స్థాపన కోసం బహుజన ప్రజలను చైతన్యం చేయడానికి తన అత్యున్నతమైన ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి మొట్టమొదటి సరిగా ఖమ్మంలో జరుగు సదస్సుకు ముఖ్యఅతిథిగా వస్తున్న డాక్టరు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, విశిష్ట అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ పాల్గొనే సదస్సుకు బహుజనులు స్వాగతం పలకలన్నారు. టి ఎన్ జి ఓ ఎస్

ఫంక్షన్ హాల్ లో జరిగే బహుజన సమ్మేళన సభలో  పాల్గొంటారని తెలిపారు. 90 శాతం జనాభా ఉన్న బహుజనులు, సమసమాజ స్థాపన కోసం పార్టీల కతీతంగా విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, మేధావులు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ బొంతు సత్యకిరణ్, గంధం మల్లికార్జున్ రావు, గుడివాడ రాజేందర్, సందేల శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: