CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు ఓసీ లో ఓబి వెలికితీత పనులు నిర్వహిస్తున్న VPR కంపెనీ పనుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి

Share it:



మన్యం మనుగడ, మణుగూరు:

 ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందజేత

        

     మణుగూరు ఓసి లో OB వెలికితీత పనులు నిర్వహిస్తున్న VPR ob కంపెనీ శుక్రవారం నుండి  ఓ బి వెలికితీత పనులు నిలిపివేశారని తిరిగి పునరుద్ధరణకు యాజమాన్యం చొరవ చూపాలని కోరుతూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఏరియా Sotogm లలిత్ కుమార్ గారికి వినతి పత్రం అందజేశారు,ఈ సందర్భంగా గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నా సర్ పాషా మాట్లాడుతూ  ఏరియా మణుగూరు ఓసి లో  ఓ బి వెలికితీత పనులు ఆరు సంవత్సరాలకు గాను కాంట్రాక్టు దక్కించుకున్న VPR  MIPL యాజమాన్యం  ప్రాజెక్టు పనులు అనుమతుల్లో జాప్యం పని స్థలాల కొరత కారణంగా ఓబి వెలికితీత పనులు నిలిపి వేస్తున్నామని నోటీస్ బోర్డ్ ద్వారా ఓబి వర్కర్లకు తెలియపరిచారు, VPR యాజమాన్యం చెబుతున్న కారణాలు ఏమైనప్పటికి  ఈ చర్యల ఫలితంగా ఈ కంపెనీని  నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న స్థానికులు,స్థానికేతరులు, నిర్వాసితులు సుమారు 350 మంది ప్రత్యక్షంగా ఇంకా 150 కుటుంబాలు పరోక్షంగా రోడ్డున పడే అవకాశం ఉంది , అసలే కరోనా కష్టకాలంలో పనులు దొరక్క ఇబ్బంది పడుతున్నా నేపథ్యం కూడా ఉంది,అంతేకాకుండా బొగ్గుకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో సింగరేణి యాజమాన్యం మణుగూరు ఓ సి కి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో కూడా వెనకడుగు వేసే అవకాశం ఉంది, ఈ నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి ,కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధి దృష్ట్యా VPR  యాజమాన్యంతో మరొకసారి మాట్లాడి వారి మనోభావాలు కూడా దృష్టిలో ఉంచుకొని వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించి క్షేత్రస్థాయిలో పనికి ఆటంకాలు లేకుండా చూసి తిరిగి OB  వెలికితీత పనులకు  ఆటంకం లేకుండా   పునరుద్ధరణ తో పాటు సజావుగా సాగేలా చూడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో  ఏ మంగీలాల్, రామకృష్ణ ,సాయి  మరియు VPR కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.

Share it:

POLITICS

TELANGANA

Post A Comment: