CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి మాటున ఆదివాసుల విధ్వంసం

Share it:

 


👉ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలు

👉జీవో నెంబర్ 3 తో ఆగమ్యగోచరంగా గిరిజన పట్టభద్రుల బతుకు

👉నేటికి కరెంటు సౌకర్యాలు లేని గ్రామాలు ఎన్నో

👉మూలవాసులు అట్టడుగు వర్గాలు గా మారుతున్నారు

👉 ఆదివాసి సంఘాలలో ఐక్యత లోపం

🙏నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

✍️కొత్త దామోదర్ గౌడ్,మన్యం మనుగడ ప్రతినిధి

ప్రపంచ మూలవాసులు గా చెప్పుకునే ఆదివాసుల బతుకులు ఆగమ్యగోచరంగా తయారయ్యాయి .పాలకుల తీరుతో చీకటి బతుకులు గా మారాయి. అభివృద్ధి పేరుతో విలువైన భూములు కోల్పోతు నానాటికీ  వారి జీవనం ప్రశ్నార్థకంగా మారుతోంది. పోడుకు పట్టాలు ఇవ్వకపోవడంతో ఫారెస్ట్ దాడులకు గురవుతున్నారు. ఇది యావత్ భారతదేశంలో ఆదివాసి బిడ్డల గోడు. అభివృద్ధితో భారతదేశం వెలుగుతుంది అనే నినాదం చేస్తున్న పాలకులకు ఆదివాసి అభివృద్ధి పట్టడం లేదా? విలువైన సంపదకు నిలయంగా ఉన్న అడవులను ధ్వంసం చేయడంతో ఆదివాసి జాతి ప్రమాదంలో ఉంది. అడవే కన్న తల్లిగా భావించే మూలపురుషులు నేడు అదే అడవి నుండి బయటికి గెంటి వేయబడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు, బాక్సైట్ గనులు మూలంగా ఆదివాసులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మావోయిస్టు, పోలీసులు మధ్యన ఆదివాసి  బిడ్డలు నలగ లేక కట్టుబట్టలతో తెలుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. ఇక్కడ అదే పరిస్థితి నెలకొనడంతో బతుకు జీవుడా అని జీవన్ వెళ్లదీస్తున్నారు. సరియైన చదువు లేక పౌష్టికాహారం అందక వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జీవో నెంబర్ 3 ఆదివాసి బిడ్డలు కొలువులకు దూరమయ్యారు పోటీ ప్రపంచంలో రాణించలేక ఉన్న భూమి నుంచి ఫారెస్ట్ అధికారులు బలవంతంగా బయటకు వెళ్ళగొట్టడం, సింగరేణి ఇతర ప్రాజెక్టుల మూలంగా భూములను కోల్పోవడం వారికి శాపంగా మారింది. కంటితుడుపు చర్యగా ప్యాకేజీలు ఇచ్చినప్పటికీ అది వారికి శాశ్వత పరిష్కారం చూపెట్ట లేకపోతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ మహిళల కోసం ఐటీడీఏ పటిష్టపరచడం తో పాటు వారికి మెరుగైన ప్యాకేజీ అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడే ప్రపంచ ఆదివాసి దినోత్సవం.

Share it:

Post A Comment: