CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జర్నలిస్ట్ బందు ప్రకటించి, విలేకరులకు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలి

Share it:

 


సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

జర్నలిస్ట్ బందు ప్రకటించి ప్రతి విలేకరి కి పది లక్షల రూపాయలు ఇవ్వాలని సీతక్క యువసేన తాడ్వాయి మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్ చేశారు, మంగళవారం తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ ఆవరణలో ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడినారు. సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఒక హుజురాబాద్ లో మాత్రమే దళిత బందు పథకం తేవడం దుర్మార్గం అని,ఉద్యోగులకు కూడా దళిత బందు ఇస్తున్నారు అని,మరో పక్క రైతు బందు పేరు తో భూస్వాములకు,ఉద్యోగులకు చివరికి విదేశాలలో ఉండే ఎన్నారై లకు కూడా లక్షలు రూపాయలు ఉచితంగా ఇస్తున్నారు.కానీ ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం అయినా విలేకరుల కు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, సమాజం లో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రజల సమస్యలు ప్రభుత్వం కు తెలిసే విదంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విదంగా నిర్వీరామంగా పని చేస్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు కూడా జర్నలిస్ట్ బందు ప్రకటించి ప్రతి జర్నలిస్ట్ కు కూడా తక్షణమే పది లక్షలు రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణా ఏర్పాటు అయినా తర్వాత కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్ట్ ల కోసం చేసింది శూన్యం అని అన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని,వివిధ కార్పొరేషన్ స్కీం లలో కూడా ఎంపిక చేసి ఆడుకోవాలని కోరారు.తాడ్వాయి మండలం కు సంబందించి జర్నలిస్ట్ లు ప్రజల అభిప్రాయాలను, వాస్తవాలు రాస్తే కొంతమంది తెరాస నాయకులు జీర్ణించుకోలేక అడ్డ దిడ్డం గా ఏదోదో మాట్లాడుతున్నారు. అయినా మేము వాళ్ళ గురించి అసలు పట్టించుకొం అని,విమర్శలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని,ఎల్లప్పుడు ప్రజల పక్షం ఉంటాము అని అన్నారు.జర్నలిస్ట్ లకు మద్దతుగా ఉంటామని, జర్నలిస్ట్ బందు ప్రకటించకుంటే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని అన్నారు.

Share it:

Post A Comment: