CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత బంధు అడ్డుకునే కుట్రలను తిప్పికొట్టాలి

Share it:

 


*అన్ని వర్గల ప్రజలు దళిత బందుకు మద్దతు ప్రకటించాలి. 

మన్యం టీవీ ఏటూరు నాగారం

 ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలోదళిత జన సేవ సమితి మండల అధ్యక్షులు జన్ను సుధాకర్,జన్ను కర్నాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టిన సందర్భంగాతెలంగాణ దళిత బందు ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,ములుగు నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ గారికి,తెలంగాణ రాష్ట్ర మంత్రులకుహృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ములుగు నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జి నెమలి బాలకృష్ణ హాజరై మాట్లాడుతూ.

తెలంగాణ దళిత బంధును అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు,అన్ని పక్షల ప్రజలు,యువత వారి మద్దతును ప్రకటించి తోటి దళితులకు ఆర్థిక జీవన విధానం తోడ్పాటుకు అందరూ సహకారాన్ని అందించాలి అని కోరారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ప్రఖ్యాతులు అందుకున్నాయి అన్నారు. 

తెలంగాణ దళిత బందు ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,రాష్ట్ర మంత్రులకు,ములుగు నియోజకవర్గ ఇంచార్జి కుసుమ జగదీష్ గారికి

హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అంతే కాకుండా ఈ పథకంలో నిరుద్యోగ యువతకు,నిరు పేదలకు,

ప్రాముఖ్యత ఇవ్వాలి అని కోరారు.దళిత పథకాన్ని అమలు చేసే క్రమంలో దళిత యువకులు,ప్రజలు ఆగమాగం కాకుండా ఆలోచన తో పథకం అమలు,వాటి విధి విధానాలు తెలుసుకొని జాగ్రత్తగా లబ్ది పొందాలని అన్నారు. 

గతంలో గోవిందరావు పేట బడుగు బలహీన వర్గలకు,అగ్రవర్ణ పేదలకు వచ్చిన డబుల్ బెడ్ రూమ్ తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చిన గృహాలు వెనక్కి వెళ్లిన మాదిరిగా కుట్రలు జరిగి అన్ని పక్షాల ప్రజలు నష్టపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇండ్లు లేక మోకాళ్ల లోతు నీళ్లలో,కురిసే గుడిసెలలో వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.

చివరికి నష్టం దళితులకు జరగడం ఖాయం అని అన్నారు.కావున అన్ని కుల సంఘాల,ప్రజాలు,రాజకీయ పార్టీలు మద్ధతుగా నిలవాలి అని అన్నారు.దళితుల మధ్య చిచ్చు పెట్టె రాజకీయాలను దళితులు పసిగట్టి వారి కుట్రలను తిప్పి కొట్టాలి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు దళిత బందు పథకం లబ్ది పొందే విధముగా విజ్ఞతతో ఆలోచన చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో నమావరపు వెంకటేశ్వర్లు, కనకం నారాయణ,జంగిడి ప్రకాష్,జన్నుఐలయ్య,మామిడి అబ్బాస్ జన్ను రమేష్,విరేటి నర్సయ్య,అమరరపుగాంధి, గోపిదాస్ మధు,అమరరపు శ్రీను,ఈర్ల రాము,ఈర్ల సాంబశివరావు,జోగు శ్రీను,అమరరపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: