CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోగుల మన్ననలు పొందుతున్న డాక్టర్ శివ కుమార్

Share it:

 



👉వైద్యో నారాయణ హరి అనే నానుడికి తులతూగే వ్యక్తి

👉ప్రజల ఆరోగ్యం కోసమే నా తపన

👉పరిధికి మించి కొంత మంది ఆర్ ఎం పి లు వైద్యం చేస్తున్నారు

👉 ఆర్థిక ప్రయోజనం కోసం అధిక ఆంటీబయాటిక్స్ వినియోగం

👉జ్వర పిడితుల మరణాలకు ఇది ఓ కారణం

👉వారి మూలంగా మండల వైద్య శాఖ కు చెడు పేరు

👉గ్రామీణ వైద్యులకు నేను వ్యతిరేకం కాదు

👉పరిమితికి లో బడి వైద్యం చేయాలని సూచన

👉పినపాక వైద్య అధికారి బి.శివకుమార్

మన్యం మనుగడ పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శివ కుమార్ మండలంలో సహనానికి మారుపేరు అన్న విధంగా తన సేవలను అందిస్తున్నారు. సాంకేతికపరంగా, వైద్య విజ్ఞానం పరంగా ప్రైవేటు ఆసుపత్రులలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పటికీ, డాక్టర్ శివ కుమార్ అందిస్తున్న నిస్వార్థమైన సేవ పట్ల మండలంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజానీకం, గర్భిణీ మహిళలు, వయసుతో సంబంధం పిల్లా, పెద్దా అందరూ ప్రాథమిక కేంద్రానికి వైద్య పరీక్షల నిమిత్తం వస్తున్నారు. మంగళవారం రోజున పినపాక మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన, 55 మంది గర్భిణీ స్త్రీలకు ఒకే రోజు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆహార నియమాల గురించి డాక్టర్ శివ కుమార్ వివరించడం జరిగింది. యాంటిబయాటిక్స్ వాడడం వలన జరిగే దుష్పరిణామాలు గురించి తెలియజేయడం జరిగింది. శివ కుమార్ చేస్తున్న వైద్య గురించి మన్యం మనుగడ వివరాలు కోరగా, శివ కుమార్ సారు ఎంతో ఓపికగా, విసుగు చెందకుండా సమస్యలను విని, దానికి అనుగుణంగా మందులను రాసి ఇస్తున్నారని తెలియజేశారు. నేటి కాలంలో గర్భిణీ స్త్రీలు ప్రైవేటు ఆసుపత్రికి వెళితే వేల రూపాయలు వృధాగా ఖర్చు అవుతున్నాయని, ఈ సారు దయవల్ల, ఎటువంటి ఖర్చు లేకుండానే వైద్యం జరుగుతుందని వారి సంతోషాన్ని వ్యక్తపరిచారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన పినపాక మండలం లో ఇటువంటి డాక్టరు ఉండడం ఏజెన్సీ ప్రజల అదృష్టం అని ఆసుపత్రికి వచ్చిన మహిళలు తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి సకల సౌకర్యాలు కల్పించే దిశగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దాలని వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

Share it:

Post A Comment: