CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీ ఏరియాలో సైకిల్ రన్ నిర్వహణ పాల్గొన పోలీస్ అధికారులు...

Share it:

 



మాన్యం టివి దుమ్ముగూడెం: నిత్యం పని వత్తిడి ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండే భాద్యతాయుతమైన పదవి ..24 గంటలు తన పరిధిలో ఎక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకుని తక్షణ పరిస్కారం చూపాలిసిన అధికారి ఆయన క్షణం తీరిక లేకుండా ఓ వైపు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఏజెన్సీ లో క్లిష్టపరిస్థితులను 

అధ్యయనం చేస్తూ ఎప్పటికపుడు తన తోటి సిబ్బందికి సలహాలు ,సూచనలు అందిస్తూ శాంతిభద్రతల పర్యవేక్షణలో తనదయిన శైలి సంతరించుకున్న అధికారి ...ఒక్కరోజు శెలవు దొరికితే చాలు కుటుంబంతో సేద తీరొచ్చు అనుకొనే ఈ రోజుల్లో ...అదీ అదివారం ,రాఖీ పౌర్ణమి పబ్లిక్ 

హాలిడే ...హాయిగా ఇంట్లో కూర్చుని కుటుంబ సభ్యులతో సరదాగా గడపొచ్చు ..కానీ ఆయన ఆలోచన తీరు వేరు ..తాను పనిచేస్తున్న ప్రాంత ప్రజలు ,యువత భవిత ఎలా అన్నదే ఆయన ఆలోచన ..యువతలో స్పూర్తి నింపి వారి బంగరు భవిష్యత్తుకి పునాది వేయాలన్న తపనతో ఓ వినూత్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు .తన ఆలోచనను తోటి అధికారులతోపంచుకొన్నారు ..అదికారులు సహకరించడం తో అదివారం ఉదయం శెలవు దినమైనా "సైకిల్ రన్ " దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ నుంచి

ఏర్పాటు చేసారు ..ఇంతకీ ఆయన ఎవరంటే భద్రాచల ఎస్పి డా.వినీత్ ఐపీఎస్ .ప్రణాళికచేయడమే కాకుండగా తను ముందుండి సైకిల్ ఎక్కి తోటి అదికారులతో పాటు సిబ్భంది తో కలిసి 25 కిలోమీటర్స్ సైకిల్ యాత్ర నిర్వహించి విజయవంతంగ వెనుదిరిగి వచ్చారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యువత నిర్లిప్తతను విడనాడి సమాజంలొ ఉన్నతస్థానం సాధించాలని ,వారిలో ప్రేరణ సేకుర్చేందుకే సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు .అత్యంత ధైర్య సాహసాలతో యువతలో స్పూర్తి ఏఎస్పీ వినీత్ ను పులువురు అభినందించారు .ఈ సైకిల్ యాత్రలో ఏఎస్పీ తో పాటు భద్రాచలం సబ్ జైల్ అధికారి కూన అనందరావు ,భద్రాచలం ,దుమ్ముగూడెం సి ఐ లు తాటిచర్ల స్వామి ,నల్లగట్ల వెంకటేశ్వర్లు ,ట్రాఫిక్ ఎస్ ఐ శ్రీపతి తిరపతి ,పులువురు పోలిస్ సిబ్భంది ,ఆఫిసర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: