CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వయం పాలన దిశగా అడుగులు వేద్దాం...

Share it:

 


 ప్రతీ గ్రామానికి, ఇంటికీ బీఎస్పీని చేరువ చేద్దాం


- బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యర్రా.కామేష్ 

*మన్యం టీవీ కొత్తగూడెం*:-

అగ్రవర్ణాల కనుసన్నల్లో నడిచే పార్టీల్లో కార్యకర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టి కార్యకర్తలుగానే మిగిలే రోజులు పోయాయని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ అన్నారు. ఆదివారం రుద్రంపూర్ లో పెద్ద ఎత్తున యువత బీఎస్పీ పార్టీ లో చేరిన సందర్భంగా ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో 0.5 శాతం ఉన్న వారు గత ఏడు సంవత్సరాలుగా పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలుగా ఉండి, కార్యకర్తలుగానే మిగిలే రోజులు పోయాయని, ఒక నిర్ధేశిత లక్ష్యంతో విశాల దృక్పథంతో ఏర్పడిన పార్టీ బీఎస్పీ అని గుర్తు చేశారు. కార్యకర్తల నుంచి అత్యున్నత రాజ్యాంగ బద్ధమైన పదవుల వరకు వెళ్లాలంటే అందుకు బీఎస్పీ పార్టీ సరైన వేదిక అని గుర్తు చేశారు. సిద్ధాంతాలను విశ్వసించి పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరూ ఒక సైనికుల్లా పని చేయాలని కోరారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామానికి, ప్రతీ గడపకు వెళ్లాలని తెలిపారు.ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తనకు సమాచారం ఇవ్వాలని, ఒక న్యాయవాదిగా, పార్టీ జిల్లా అధ్యక్షుడుగా పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. ఏడాదికి రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికిన కేంద్రంలోని బీజేపీ, 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో పాలనలు సాగిస్తున్నాయని ఆరోపించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఇష్టారాజ్యంగా ప్రైవేటుపరం చేస్తుంటే, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ భూములను తమ కుటుంబ సభ్యులకు, వారి చెంచాలకు బినామీ పేర్లతో కట్టబెతుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. వీటన్నింటినీ చెరిపివేసి ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టేందుకు పుట్టిన బీఎస్పీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ ముందుకు కదలాలని హితవు పలికారు.

బీజేపీ చుంచుపల్లి మండల కార్యదర్శి *ఆట శ్రీకాంత్* మరియు బాబుక్యాంపు కు చెందిన *బాపనపల్లి కళ్యాణ్* ఆధ్వర్యంలో 50మంది యువకులు బీఎస్పీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో *జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి,అసెంబ్లీ కన్వీనర్ బొంతు కిరణ్,సీనియర్ నాయకులు గంధం మల్లికార్జున్ రావు,చుంచుపల్లి మండల అధ్యక్షురాలు వీణ,చెనిగారపు.నిరంజన్ కుమార్,ఆముదాల.ప్రవీణ్* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: