CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి బిడ్డను అవమానించడాన్నీ ఖండిస్తున్నాం

Share it:

 



*ప్రోటోకాల్ పాటించని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా పై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ,ఉద్యోగ సంఘాలు


మన్యం టీవీ మణుగూరు: 

తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావును అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు పిలిచి ప్రోటోకాల్ పాటించని, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా. వెంకటేశ్వరరావు, ఆయన పుత్రుడు వనమా రాఘవ పై మణుగూరు మండలం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రజా ప్రతినిధులు,ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడ్డారు.ఆదివాసి బిడ్డ అయ్యుండి,ఉన్నత స్థానాలను అధిగమిస్తున్నాడనే ఈర్శ్య, అసూయ ల కారణంగా రేగా కాంతారావు ను అంబేద్కర్ సాక్షిగా అవమానించారని, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ అన్నారు. ఆదివాసి బిడ్డ ఉన్నత స్థానాల్లో ఉండడం పట్ల ఆదివాసులు గర్వపడుతున్నామని,అంచలంచలుగా ఎదుగుతున్న ఆదివాసి బిడ్డను అణగదొక్కడం కోసమే ఇలా ప్రవర్తిస్తున్నారని,భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రమేష్ కుమార్ కు లిఖిత పూర్వకంగా విన్నవిస్తామని తెలియజేశారు.ఆదివాసీ ఉద్యొగ, సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలెబోయిన.అనిల్ కుమార్ 

మాట్లాడుతూ, జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ సమక్షం లో సభా ముఖంగా ఆదివాసీ ఎమ్మెల్యే ,ప్రభుత్వ విప్ రేగా ను అవమానించడం చాలా బాధాకరమని,ఈ చర్యను ఖండిస్తున్నాం అని తెలిపారు.ఆదివాసీల జోలికి వస్తే ఖబర్దార్ ఎమ్మెల్యే వనమా ఆదివాసి సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదని , ఆయన హెచ్చరించారు. జానంపేట సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ , ఆదివాసుల ఎదుగుదలను ఓర్వలేక,డా.బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా విప్ రేగాను అవమానించారని, ఇందుకు రానున్న రోజుల్లో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. మణుగూరు మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు, బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని. బాబురావు మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, మంత్రి గా పనిచేసిన ఎమ్మెల్యే వనమా కు ప్రోటోకాల్ తెలియదా అని ప్రశ్నించారు.గిరిజన,ఆదివాసీ ఎమ్మెల్యే రేగా కు విప్ పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు అని,ఆగస్టు 15 న జిల్లా కేంద్రంలో జాతీయ జెండాను ఎగురవేసే అవకాశం ప్రభుత్వం విప్ రేగా కు కల్పించింది అని,విప్ రేగా అభివృద్ధి చూసి తట్టుకోలేక అవమానపరిచారు అని అన్నారు.ఈ విషయం పై ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి, సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం పివి కాలనీ లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయ కుమారి,ఎంపీటీసీ కాయం శేఖర్,పోలిశెట్టి హరీష్,పినపాక సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, ఎం.నర్సింహారావు,సర్పంచ్ లు కాయం.తిరుపతమ్మ, ఈశ్వరమ్మ,పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు శ్రీనివాస్,అశోక్, ఆదివాసీ సంఘాల నాయకులు,టిఆర్ఎస్ నాయకులు వట్టం. రాంబాబు,ముఖ్య నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: