CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు బహిరంగ క్షమాపణ చెప్పాలి

Share it:

 


లేనియెడల వనమా ఇల్లు,ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తాం:ఆదివాసీ సేన


మన్యం టీవీ మణుగూరు: ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావుని ప్రోటోకాల్ విషయంలో అవమానపరిచిన అధికార పార్టీ నిర్వాహకులు,జిల్లా అధికార యంత్రాంగం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని,లేనియెడల భద్రాద్రి కొత్తగూడెం లో గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,వనమా ఇల్లు ను, అన్ని ఆదివాసీ సంఘాలు,రేగ కాంతారావు అభిమానులతో ముట్టడిని చేస్తాం అని ఆదివాసి సేన జిల్లా కో కన్వీనర్ వజ్జ జ్యోతి బస్ హెచ్చరించారు. ఆదివారం నాడు, మణుగూరు లో జరిగిన సంఘ అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ, నేడు స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న,ఆదివాసీలు,దళితుల పైన వివక్షత కొనసాగుతుంది అనడానికి, శనివారం జరిగిన సంఘటన నిలువెత్తు సాక్ష్యం అని,ఒక విప్ హోదాలో ఉన్న ఆదివాసీ ఇలా అవమానించడం తీవ్ర అభ్యంతరకరం అని,నేడు మంత్రి పదవి కి సమాన హోదాలో ఉన్న వ్యక్తికి ఇలా జరిగితే,క్రింది స్థాయిలో వున్న ఆదివాసీ,దళితులకు ఎలాంటి గౌరవం దక్కుతున్నాయో ప్రస్తుత రాజకీయ పరిస్థితులనూ తేటతెల్లం చేస్తున్నాయని, అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రణాళిక ప్రకారము వివాదాలు సృష్టించడం, ఆదివాసీ భూములు బలవంతంగా గుంజు కోవడం,దాడులు చేయడం, అవమానించడం జరుగుతున్నాయని,రాజకీయ పార్టీలోని అగ్రవర్ణాలు ఇలాంటి అవమానకరమైన పద్ధతులు మార్చుకోవాలని, లేని యెడల ఏజెన్సీ లో కాలు కూడా కదపలేని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గనబోయిన ముత్తయ్య,పూనెం.నాగరాజు,బండారు.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: