CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ వరలక్ష్మి...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు, ఆగస్టు 26, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో గురువారము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పిడి ఆర్ వరలక్ష్మి అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సెప్టెంబర్ 1 నుండి ఎల్కేజీ నుండి పిజి వరకు విద్యాసంస్థలు ప్రారంభించాలని, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలను కూడా ప్రారంభించాలని, ఆదేశించారు. ఈ క్రమంలో ఐసిడిఎస్ అధికారులు కూడా తమ మండలాలలో అంగన్వాడీ కేంద్రాల పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు. కరోనా కష్టకాలంలో గర్భిణీ బాలింతలకు మరియు ప్రీస్కూల్ పిల్లలకు టి హెచ్ ఆర్ ఇంటి వద్దనే అందించారని ఇక నుండి అనగా సెప్టెంబర్ 1 నుండి అంగనవాడి కేంద్రాలకు రావాలని అన్నారు. అంగన్వాడి కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వారికి తెలియజేయాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కొని భోజనాలు పెట్టాలని కార్యకర్తలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మరియు కొమ్ముగూడెం సెక్టార్ సూపర్వైజర్లు జి అరుణ, యం లక్ష్మి ,హసీనా, అంగన్వాడీ కార్యకర్త విజయ ఆయా తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: