CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మా పోరాటం దొర మీదనే దొర బానిసల మీద కాదు

Share it:


*మేడారం జాతర కమిషన్ల కోసం మే సీతక్క మీద విమర్శలు.

*సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్.

*మన్యం టీవీ ఏటూరు నాగారం

మా పోరాటం దొర మీదనె అని దొర బానిసల మీద కాదు అని సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ అన్నారు.ఆదివారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ మాట్లాడుతూ,కొంతమంది నాయకులం అని చెప్పుకునే వాళ్ళు జాతీయ నాయకురాలు అయినా ములుగు ఎమ్మెల్యే సీతక్కను,కాంగ్రెస్ పార్టీ ని విమర్శిస్తున్నారు అని,ఇలాంటి వాళ్ళను మేము పట్టించుకోము అని అది వారి విజ్ఞత కే వదిలేస్తున్నాం అని,అయినా దొర మీద మా పోరాటం కొనసాగుతుంది అని,దొర బానిసల మీద కాదు అని అన్నారు,ఎమ్మెల్యే సీతక్కను ప్రపంచం మొత్తం గుర్తిస్తుంటే చివరికి నిన్న  హైదరాబాద్ ప్రెస్ మీట్ లో మంత్రి మల్లారెడ్డి కూడా సీతక్క మంచిది అన్నాడు.అంటే ఇవన్నీ కనిపించడం లేదా అని నీలాదీశార. గంగిరెద్దులు వాళ్ళు కూడా సంవత్సరం కు ఒకసారి సంక్రాంతి కి గ్రామం కు వస్తారు అని,రెండు సంవత్సరాలకు ఒక సారి కనిపించే వాళ్ళ గురించి మేము మాట్లాడం వృధా అని,మేడారం జాతర వస్తుంది.కాబట్టి ఆ పార్టీ వాళ్ళు పక్కకు పెట్టారు అని కమిషన్లో వాట కోసం ఎమ్మెల్యే సీతక్కను విమర్శించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ని ములుగు జిల్లా ఆరాధ్య దేవత లాంటి ఎమ్మెల్యే సీతక్కను విమర్శించకుండ మీ పార్టీ ఇచ్చిన హామీల నెరవేర్చాలి అని,కెసిఆర్ ఇచ్చిన హామీలు అయినా డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పోడు భూములకు పట్టాలు,రోడ్లు,మేడారం జాతర కు 200 కోట్లు,మేడారం లో  కాలేజీ,తాడ్వాయి మండలం మొత్తం రైతుల పొలాలకు గోదావరి నీళ్లు తదితర 300 హామీలు జంపన్న వాగు వరదలో కొట్టుకపోయాయి అని,కాంగ్రెస్ పార్టీ మరియు సీతక్క తాడ్వాయి మండలం లో చాలా మంది కు అన్నం పెట్టింది అని,సర్పంచ్ గా చేసింది అని,ఇది గుర్తుంచుకొని మాట్లాడాలి అని,కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలుసుకొని మాట్లాడితే బాగుంటది అని,లేకుంటే ప్రజలు మరియు  కాలమే సమాధానం చెప్తుంది అని హెచ్చరించారు.

Share it:

Post A Comment: