CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే సీతక్క ను విమర్శించే స్థాయి నాగజ్యోతి కి లేదు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదని ఈ మధ్య కాలంలో పదే పదే జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి విమర్శించడం సరికాదని ఆమెకి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది.కాంగ్రెస్ పార్టీ అని కాల్వపల్లి సర్పంచ్ గా చేసింది.ఎమ్మెల్యే సీతక్కని  గుర్తుపెట్టకోవాలని సూచిస్తున్నాము అని ఆదివారం తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మండల అధ్యక్షులు మాట్లాడుతూ ఆదివాసీల కొరకు సీతక్క చేసింది ఏమి లేదని విమర్శిస్తున్న నీవు జిల్లా వైస్ చైర్మన్ గా ఉండి కనీసం నీ గ్రామంలో ఏం అభివృద్ధి చేసావో చెప్పాలి.రెండు సంవత్సరాలుగా కరోనా బారిన పడిన ఆదివాసీ గుడేల వెను వెంట ఉండి నిత్యం వారిని ఆదుకున్న చరిత్ర సీతక్కది        అలాంటి ఎమ్మెల్యే సీతక్కను విమర్శించే స్థాయి నీదా.?    

ఆదివాసులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నవా...      ఆదివాసీ పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ...అప్పుడు నువ్వెక్కడున్నావు ఆదివాసీ గుడెలపై ఫారెస్ట్ అధికారులు దాడులు జరుపుతుంటే ఒక్క రోజు కూడా మాట్లాడని నీవు నీ పార్టీ సీతక్కని విమర్శిస్తారా... ములుగు జిల్లాలోని ప్రతి గ్రామం తన సొంత ఇంటి ఆడబిడ్డ లాగా గౌరవించే సీతక్కను ఆమె ఎదుగుదలని ఓర్వలేని కొందరు నీతో మాట్లాడిస్తుతున్నారని మాకు తెలుసు నీ స్థాయికి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు.పత్రిక పరమైన ప్రకటనలు చేసే ముందు కొన్ని వాస్తవాలను అర్హతలను విశ్లేషణ చేసుకోవాలి.మరొక్కసారి సీతక్కను విమర్శిస్తే తగు విధంగా బుద్ధి చెప్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు కొర్నే బెల్లీ నాగమణి,వైస్ ఎంపీపీ పాక కాంత,కాటాపూర్ ఎంపీటీసీ మేడిశెట్టి జయమ్మ,కామారం రేగ సర్పంచ్ కళ్యాణి,అంకంపల్లి సర్పంచ్ వట్టం సావిత్రి,రంగాపూర్ సర్పంచ్ ఇరప అశ్విని,పంబాపూర్ సర్పంచ్  ఏల్లబోయిన జానకి,లింగాల సర్పంచ్ ఊకే మౌనిక, నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నరసింహస్వామి,తాడ్వాయి సర్పంచ్ ఇరప సునీల్ దొర తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: