CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నాణ్యత లోపంతో డ్రైనేజి పనులు

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో జరిగే జాతీయ రహదారిపై రోడ్ సైడ్ డ్రైనేజ్ పనులను ఆదివారం కాంగ్రేస్ పార్టీ నాయకులు పరిశీలించారు. రోడ్ కు డబుల్ డ్రైనేజ్ చేయకుండా ప్రభుత్వం, అధికారులు,కాంట్రాక్టర్స్ ఒక్కటే డ్రైనేజ్ చేయడం సిగ్గు చేటుని నాణ్యత లోపంతో చేస్తున్నా పనులు పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులుని కాంగ్రేస్ మండల పార్టీ ఆద్యక్షుడు చిటమట రఘు ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటూరు నాగారం అభివృది చెందుతున్న ప్రాంతం కాబట్టి ముల్లకట్ట బ్రిడ్జి నిర్మాణం వల్ల రాకపోకలు ఛత్తీస్గఢ్,మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల నుండి రాకపోకలు,చుట్టాల బందువులు,బాంధవ్యాలు పెరిగాయి,దానివల్ల ఇచ్చి పుచ్చూ కునే పెండ్లిండ్ల వ్యవహారం,వ్యాపార, వ్యవహారాలు,అభివృధిచెందుతుండడంతో అందరి చూపు ఏటూరు నాగారం వైపే చూస్తున్నారు.సిటీగా రూపాంతరం చెందుతుందడంతో అందరూ కూడా ఏటూరు నాగారంలో ఉండడానికి ఇంటి స్థలాలు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్నారు.రెవిన్యూ డివిజన్ గా అయితే, సైడ్ డ్రైనేజ్ సరిపోదని అన్నారు. అధిక నాణ్యత లోపంతో చేస్తుండడంతో ఎన్ని రోజులు ఉంటుందని అంచనా కూడా లేదు.నాయకులు చొరవ చూపక పోవడ తో సదరు కాంట్రాక్టర్ తు తూ మంత్రంగా పనులను పూర్తి చేసినాడని, సైడ్ డ్రైనేజ్ పనులలో నాణ్యత లేకుండా ఒక ప్రణాళిక పద్ధతి లేకుండా నిర్మాణం చేస్తున్నారని,చేస్తున్న సైడ్ డ్రైన్ కాలువ గోడలు ఎత్తు తక్కువగా ఉండడంతో వెడల్పు తక్కువగాఉండడంతో రోడ్డుపై ఉన్న మట్టి గాని లేదా షాపుల ముందు యజమానులు పోసుకున్న మట్టి కానీ కాలువలో పడి పోతుంది అని అన్నారు.సదరు ఆర్ అండ్ బి అధికారులు ఎస్టిమేషన్ సరిగా చేయలేదని అధికారులు కాంట్రాక్టర్లు బాగు పడేలాగా ఉందని కేవలం కమీషన్ల కోసమే లాభాల కోసమే అధికారులు కాంట్రాక్టర్లు ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు.వీరు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఇట్టి పనులపై కలెక్టర్ గారు పర్యవేక్షణ చేసి నాణ్యత లోపాలను సవరించేలా చూడాలని కోరారు.ఈకార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న,పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరు బాల రాజు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: