CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత ఐక్య వేదికలో పాల్గొన్న దళిత నాయకులు పల్లికొండ యాదగిరి

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

ఉమ్మడి వరంగల్ జిల్లాల 59 షెడ్యూల్ కులాల సమగ్రాభివృద్ధి సాధన సభలో ములుగు జిల్లానుండి పల్లికొండ యాదగిరి ఇతర దళిత నాయకులు పాల్గొని దళిత ఐక్యవేదికను జయప్రదం చేసారు.ఈ దళిత ఐక్య వేదికలో అతిరధ మహారదులు అద్దంకి దయాకర్, మందకృష్ణ మాదిగ లాంటి రాష్ట్ర నాయకులు పాల్గొని దళితుల ఐక్యంగా ఉండి దళితుల సమగ్ర సాధనకు కృషిచేయాలనీ పిలుపునిచ్చారు. తదనంతరం పాత్రికేయులతో ఈ సందర్బంగా దళిత ముఖ్య నాయకులు పల్లికొండ యాదగిరి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలనుండి దగా పడిన దళిత బ్రతుకులు మారాలంటే 59 షెడ్యూల్ కులాలు ఓకే అజెండాతో జెండాలన్నీ పక్కనపెట్టి దళిత అజెండా భుజానికెత్తుకోవాలని తద్వారా మన బ్రతుకులు మార్చుకోవాలని ఈసందర్బంగా పేర్కొన్నారు. మన ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు ద్వారా ప్రతి కుటుంబానికి పదిలక్షలు ఇస్తామన్నారు ఇది హర్షించదగ్గవిషయం కానీ అనటమే కానీ ఆచరణ లేదు అని దీనికి ఉదాహరణ దళిత ముఖ్య మంత్రిని చేస్తా అన్నాడు అది కాక దళితులకు  మూడు ఎకరాలు అన్నాడు అది అమలుకు నోచుకోలేదు ఈ సారి అయినా దళిత బంధు ద్వారా దళిత కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి. ఈ పథకం ఒక్క హుజురాబాద్ కే కాకుండా యావత్ తెలంగాణాలోని అన్ని దళిత కుటుంబాలకు పదిలక్షలు ఇచ్చి తద్వారా ప్రతి దళిత కుటుంబం ఆర్ధికాభివృద్ధి సాధించుటకు పాటుపడాలని ప్రభుత్వాన్ని పల్లికొండ యాదగిరి ఈ సందర్బంగా డిమాండ్ చేసారు.

Share it:

Post A Comment: