CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ నాయకులు కళ్ళుఉండి కబోధి లాగా ప్రవర్తిస్తున్నారు

Share it:

 మన్యం టీవీ మంగపేట.


 కాంగ్రెస్ నాయకులు పత్రికలలో ఆరోపించినట్లు

వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవం 

కాంగ్రెస్ నాయకులు కళ్ళు వుండి కబోది లాగ ప్రవర్తిస్తున్నారు ఈ ఏడు సంవత్సరాలనుండి మంగపేట మండలం లో మరియు ములుగు నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి కనిపించుట లేదా 

నిన్న కాక మొన్న మండల కేంద్రంలో 50 లక్షల రూపాయల తో వేసిన సీసీ రోడ్డు అగుపడుట లేదా

నియోజకవర్గంలో మరియు మండలం లోని గ్రామాలలో అనేక సీసీ రోడ్లు మరియు వాగులపై బ్రిడ్జి లు,గ్రామ పంచాయతీ భవనాలు,శ్మశానవాటిక నిర్మాణాలు,రైతు వేదిక నిర్మాణాలు ,బీటీ రోడ్లు రెన్యూయల్ లు,మరియు ఈమధ్యకాలంలో కాంగ్రెస్ భద్రాచలం ఎమ్మెల్యే స్వంత గ్రామం అయిన తొండ్యాల లక్ష్మీ పూర్ కు బిటి రోడ్డు నిర్మాణం మీకు కనపడటం లేదా !

 ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గంలో మా ప్రభుత్వం ఇస్తున్న సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు మరియు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తూ తాను

స్వంతంగా ఇంట్లో నుంచి ఇస్తున్నట్లు పత్రికలలో సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకునేది వాస్తవం కాదా 

ఎమ్మెల్యే సీతక్క కోవిడ్ సమయంలో ప్రజలకు సేవ చేశాను అని పత్రికలలో విపరీతంగా గ్లోబల్ ప్రచారం చేసుకోలేదా 

ఇందులో సీతక్క నియోజకవర్గం లోని ఎస్సీ , ఎస్టీ ,బీసీ మైనార్టీ వర్గాలు కనబడక ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి

వలస వచ్చిన అడవులను నరికి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న గొత్తి కోయ గూడెం లో తప్ప నియజకవర్గం లోని ఏ గ్రామంలో సేవ కార్యక్రమం చేసిందో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. నియోజకవర్గం లో పేద ప్రజలు లేనట్టు కేవలం గొత్తి కోయగూడల్లో దాతల ఇచ్చిన బియ్యం, కూరగాయలు పంపిణి చేసి పత్రికల్లో సోషల్ మీడియా లో ప్రచారం చేసుకోవడం తప్ప నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీతక్క చేసిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ నాయకులు చూపించాలి అని తెరాస మా మండల పార్టీ అధ్యక్షులు

కుడుముల లక్ష్మీనారాయణ కోరారు.

మాట్లాడితే ఏడూ సంవత్సరాలనుండి ఎక్కడ అభివృద్ధి చేశారు

అని అడిగే మీకు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి

కనబడుటలేదా 

అవాస్తావాలను ప్రచారం చేసుకుంటూ అసభ్య పదజాలంతో టీఆర్ యస్ నాయకులను ప్రభుత్వాన్ని

విమర్శిస్తే మేము కూడా అదే పదజాలంతో నిలదీయాల్సిన వస్తుంది అని కాంగ్రెస్ నాయకులను ఈ సందర్బంగా 

హెచ్చరిస్తున్నాము అని తెలియజేసారు.

 అదే విధంగా అరిగిపోయినా పాత రికార్డ్ లాగా పదేపదే

మంత్రి గ అయిన మల్లారెడ్డి ని రాజీనామ

చెయ్యాలని కోరడం మరియు మంత్రిగ సవాల్ ను

స్వీకరించే దమ్ము దైర్యం లేక దిగజారుడు విమర్శలు చేయడం మానుకోవాలి.

 దళిత బంధు విషయంలో ఎమ్మెల్యే సీతక్క చేస్తున్న ఆరోపణలు అర్ధ రహితం ఎందుకంటే

దళిత బంధు పైలెట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టి కేవలం 10 రోజుల వ్యవధిలోనే 2000 కోట్లు విడుదల చేసి అమలు చేసిన ఘనత తెరాస ఉద్యమనేత ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ ది కాదా? మిగతా రాష్ట్రం అంత కూడా అమలు చేస్తాము అని ప్రభుత్వం చెప్తున్న కూడా ఇచ్చే వరకు చూసే ఓపిక కూడా లేని ఎ మ్మెల్యే సీతక్క దళిత బంధు పై విమర్శలు చేయడం సరియైన చర్య కాదు గొత్తి కోయలకే సేవ చేయాలని ఎమ్మెల్యే సీతక్క అనుకుంటే ఆమె ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్, సుకుమా నుండో ఎ మ్మెల్యే గా పోటీ చేస్తే మంచిది అని ఈ సందర్బంగా మంగపేట మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీ నారాయణ హితవు పలికారు.

ఇట్టి కార్యక్రమంలో తెరాస పార్టీ మండల అధ్యక్షులు

కుడుముల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్,రైతు సమన్వయ సమితి కోఆర్డినటర్ సామ మోహన్ రెడ్డి,

అధికార ప్రతినిధి సత్యనారాయణ,టి ఎస్ ఎస్ జిల్లా కార్యదర్శి కోడం సత్యనారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు చిట్టిమల్ల సమ్మయ్య శిద్దంశెట్టి లక్ష్మణ్ రావు ,నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ,

గ్రామ అధ్యక్షులు నూనె లింగయ్య, కుంట ఏడు కొండలు,ఆత్మ డైరెక్టర్ ఆమిలి చంద్రం, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆయుబ్ ఖాన్,

సయ్యద్ భుట్టో, ఎగ్గాడి అర్జున్,ఉడుగుల శ్రీనివాస్ యాదవ్,

మార్పు వెంకట్ రెడ్డి,పొదేం రాంబాబు,

కేక్కమ్ జగదీష్, శానం నరేందర్,బెల్లి కుమార్,చెన్నూరి సాంబయ్య,

, మీడియా ఇంచార్జి గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: