ఎమ్మెల్యే రేగా కు సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ వినతి
మన్యం టీవీ, అశ్వాపురం:మొండికుంట గ్రామ పంచాయతీ లో అభివృద్ది పనుల కు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, ఉప సర్పంచ్ సుధీర్ వినతి పత్రం అందజేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ ఎమ్మెల్యేను క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిశారు. మొండి కుంట గ్రామ పంచాయతీ లో అంగన్వాడి కేంద్రం, పాఠశాల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ను కోరారు. ఎమ్మెల్యే నిధుల నుండి మొండి కుంట గ్రామ పంచాయతీ అభివృద్ది కి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచ్ ఎమ్మెల్యే ను కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
Post A Comment: