CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములు కై వేదాంతపురం లో ఆదివాసీల ధర్నా

Share it:

 




 మన్యంటీవీ, అశ్వారావుపేట: గత 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న మా పోడు భూములను వ్యవసాయం చేసుకోనివ్వండంటూ అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఆదివాసీలు ధర్నా నిర్వహించారు. 2000 సంవత్సరం నుండి పోడు భూములే జీవనాధారంగా వస్తున్న మా గ్రామ ప్రజలకు అప్పటినుండి పనిచేసిన తహాసీల్దార్లు ఫారెస్ట్ వారికి బౌండరీలు కూడా సూచించారని 18 సంవత్సరాలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని ఫారెస్ట్ అధికారులు గత సంవత్సరం నుండి మమ్మల్ని వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 2005 లో తహశీల్దార్ గంగాభవాని, 2016 లో తహసీల్దార్ యలమర్తి వెంకటేశ్వర్లు, 2018 లో తాహాసిల్దార్ రాఘవరెడ్డి, 2021 లో తహసీల్దార్ చల్లా ప్రసాద్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బౌండరీ సర్వే కూడా నిర్వహించారని, ఇదంతా 122 సర్వే నెంబర్ లో ఉందని, ఎటువంటి వివాదం లేకుండా సాగుచేసుకుంటున్న మా భూములను గత సంవత్సరం నుండి ఫారెస్ట్ వారు ఒత్తిళ్లు చేసి దౌర్జన్యాలకు దిగుతున్నారని వేదాంతపురం ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. 2006 లో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫారెస్టు రెవెన్యూ ఉమ్మడి సర్వేలు కూడా పూర్తయ్యాయని, 2008 లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కొందరికి పట్టాలు పంపిణీ చేశారని, అట్టి వారికి రైతుబంధు కూడా అమలవుతుందని, భూములపై అకస్మాత్తుగా ఫారెస్ట్ వారు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తుంటే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వ్యవసాయం కూడా చేయలేకపోతున్నామని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పరిధిలో ఉన్న సాగుభూమి ఫారెస్ట్ వారి బౌండరీ పిల్లర్స్ కు బయట ఉన్నప్పటికీ మమ్మల్ని సాగు చేయనీకపోవడం జరుగుతుందని. గడిచిన 20 సంవత్సరాలుగా ఫారెస్ట్ వారి ఒత్తిడి గాని ప్రభావం కానీ లేదని రెండు సంవత్సరాలుగా మాత్రమే ఆపడం జరుగుందని, కనుక దయచేసి పేద కుటుంబాలు పోడు భూముల్నే జీవనాధారంగా నమ్ముకున్న ఆదివాసీలము కావున మమ్మల్ని సాగు చేయనివ్వండని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి సర్పంచ్ సోమిని శివ శంకర్ ప్రసాద్, ఉపసర్పంచ్ శ్రీకాళహస్తి, గ్రామ ఆదివాసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: