CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉పరిసరాల పరిశుభ్రత ద్వార సీజనల్ వ్యాధుల ను అరికట్టాలి

Share it:


👉10 వ వార్డులో రెండవసారి ఉచిత వైద్య శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 26(మన్యం మీడియా)

భద్రాద్రి జిల్లా కలెక్టర్, మరియు జిల్లా వైద్య అధికారి ఆదేశాల మేరకు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం పదో వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14 నెంబర్ యు పి హెచ్ సి డాక్టర్ సంజీవ రావు, పదో వార్డు కౌన్సిలర్ మునిగడప పద్మలు మాట్లాడుతూ మన ఇంటి చుట్టుపక్కల పరిసరప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని వారు అన్నారు.115 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బిపి, ఇతర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఒక్కరు కూడా జ్వరం లక్షణాలు కనిపించకపోవడం మంచి పరిణామమని వారన్నారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న నీటి గుంటలో నీరు నిల్వ ఉండకుండా దోమలు పెరగకుండా చూసుకోవాలని, అలాగే టైర్లు,ట్యూబులు,కొబ్బరిబోండా ల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ నివారణ లో ప్రజలు అందరూ సహకరించాలని, మున్సిపల్ అధికారులు కూడా దోమల నివారణ పట్ల చర్యలు తీసుకుంటున్నారని, ఇంకా మెరుగైన చర్యలు తీసుకునేందుకు వార్డు కౌన్సిలర్ గా నా వంతు ప్రయత్నం చేస్తున్నానని ఆమె అన్నారు. అనంతరం నట్టల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మందులను ఒకటో సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు వేసినారు. వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో14 నంబర్ యు పి హెచ్ సి సూపర్వైజర్ శ్రీనివాస్ అంగన్వాడి సూపర్వైజర సీత,ఏ ఎన్ ఎం లు రాజేశ్వరి, కవిత, తార, ఆశ వర్కర్లు భవాని, మహేశ్వరి, అంగన్వాడీ టీచర్స్ నీలవేణి, రజిత, సరోజ, ఆర్ పి కవిత, ఆయాలు షహనాజ్, వెంకటలక్ష్మి, కౌసల్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: