CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై దశల వారి ఆందోళనలకు సిద్ధం కండి కాంట్రాక్ట్ కార్మికులకు ఐ.ఎఫ్.టి.యు పిలుపు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా ఆదేశాల ప్రకారం కరోనా బాధితులకు 18 రోజుల వేతనం తో కూడిన సెలవు ఇవ్వాలని,ఎలాంటి పెనాల్టీ లు విధించ వద్దని, దురదృష్టవశాత్తు ఎవరైనా కరోనాతో చనిపోతే వారి కుటుంబాలకు 15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులకు ఒకటవ క్యాటగిరి వేతనం అమలు చేయాలని తదితర డిమాండ్లపై సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు పై కమిటీ పిలుపులో భాగంగా దశల వారి ఆందోళన కార్యక్రమాలలో సింగరేణి కాంట్రాక్ట్, కార్మికులు,ప్రైవేటు వాహనాల డ్రైవర్లు,ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు,కాల్ ట్రాన్స్పోర్ట్ మోటార్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షులు మంగీలాల్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం పివి కాలనీ, కూనవరం అడ్డా,మల్లారం అడ్డా,బంగ్లాస్ ఏరియా అడ్డా,సింగరేణి రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అడ్డా,ఓసి 2 రోడ్స్ క్లీనింగ్ అడ్డా,ఓసి స్టోర్స్,ఏజెంట్ ఆఫీస్,లలో జరిగిన కాంట్రాక్ట్ కార్మికుల గ్రూప్ సమావేశాలలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లాభాలలో పొరుగు సేవల కార్మికులకు వాటా ఇవ్వాలని,కాంట్రాక్ట్ కార్మికులకు,వాహన డ్రైవర్లకు,సెక్యూరిటీ గార్డులకు కూడా నివాస గృహాలు,క్వార్టర్స్ కేటాయించాలని,సోలార్ విద్యుత్ ప్లాంట్,బొగ్గు ముఠా కాంట్రాక్ట్ కార్మికులు,సులబ్, గ్లోబల్ కోల్ వాషరీస్,వే బ్రిడ్జి,తదితర విభాగాల లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను కూడా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల గుర్తించాలని,వేతనాలు సంక్షేమం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా పోస్టుకార్డు, ఉద్యమం లో ప్రతి ఒక్కరు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరారు.కార్యక్రమంలో భాగంగా కరపత్రాల ద్వారా ఏరియాలో విస్తృతంగా ప్రచారం చేసినట్లు మంగీలాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సాయి, రవి,వీర్రాజు,సాంబ,రజబ్ అలీ,శంకర్,శివ,గురుమూర్తి, మోహన్ రావు,లక్ష్మణ్, వీరస్వామి,రాంబాబు,నారాయణ కాసిం,రామస్వామి, హత్తి రామ్,ఇమాంబీ, ఉపేంద్రా,లక్ష్మి,సుశీల,నిర్మల ,లింగరాజు,శ్రీనివాస్,భీమయ్య,మంగయ్య,స్వాతి,కొమరమ్మ,ఆదిలక్ష్మి,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: