CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

★★★ ఆదివాసి గిరిజన క్రీడాకారులకు ఆర్థిక సహాయం చేసిన ఆదివాసి గిరిజన ఉద్యోగులు ★★★

Share it:

 


■◆ 40 మంది పోలీసు ఉద్యోగులు సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందజేత ◆■

👉ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీ గిరిజన క్రీడాకారులు మన్యం వార్తకు స్పందన

మన్యం మీడియా ప్రతినిధి/ ములకలపల్లి:: ఆదివాసి క్రీడాకారులైన సీతాయిగూడెం గ్రామపంచాయతీ, గండిప్రోలు గ్రామానికి చెందిన సవలం కృప, కిసరి వసంత్ లు క్రికెట్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి, సెప్టెంబర్ నెలలో జమ్ము కాశ్మీర్ లో జరగబోయే జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.కానీ నిరుపేదలైన వారి ఆర్థిక పరిస్థితుల కారణంగా చేయూత కోసం ఎదురు చూస్తున్న సమయంలో 2013 వ సంవత్సరంలో పోలీసు ఉద్యోగాలు సాధించిన 40 మంది ఆదివాసి యువకులు. ఆదివాసీ పేద విద్యార్థుల మరియు క్రీడాకారుల, నిరుద్యోగుల అభివృద్ధికి సహాయార్థం, 2013 వ సంవత్సరంలో ఏర్పాటుచేసిన సంక్షేమం నిధి ద్వారా అనేక ఆదివాసీల సమస్యల పోరాట పరిష్కార దిశలో భాగంగా గా ఆర్థిక సహాయం అందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం నాడు గండిప్రోలు గ్రామంలోని సవలం కృప,కిసరి వసంత్ లకు స్వగృహాలకు విచ్చేసి క్రీడల్లో రాణించి ఆదివాసీల జాతి పేరు నిలబెట్టేందుకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృప, వసంత్ లు మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, గిరిజన క్రీడాకారులకు వారి విజయాలు స్పూర్తి కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు.జాతిని ముందుకు తీసుకెళ్లేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్- ఎట్టి పూర్ణ చందర్, గొగ్గెల హరికృష్ణ ,తాటి సునీల్ ఉన్నారు.

Share it:

Post A Comment: