CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తరగతులు వేరు వేరు కావు

Share it:

 



*వేల సంవత్సరాలనుండి అణగారిన వర్ణాలే ఎస్సిలు ఎస్టీలు

*స్వప్రయోజనాల కోసం కులాల చిచ్చు పెట్టొద్దు

*అన్నదమ్ముల్లాంటి హరిజన గిరిజన కులాల మద్య విద్వేషాలు రగల్చొద్దు

మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండల కేంద్రంలో జరిగిన మాల మహానాడు జిల్లా సీనియర్ నాయకులు బోడ రామచంద్రం మాట్లాడుతూ మంగపేట మండలంలో గిరిజనులు దళితులు అన్నదమ్ముల లాగా కలిసి జీవనం కొనసాగిస్తుంటే గొప్ప వీరయ్య గిరిజనుల దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు.దళిత సంఘాలు ఎప్పుడు గిరిజన సంఘాలను వ్యతిరేకించలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతదేశ పౌరులు అందరూ గౌరవించాల్సిందే.మాల సంఘాలు గిరిజనులకు కానీ రాజ్యాంగాన్ని గాని వ్యతిరేకం కాదు. మాల సంఘం అంబేద్కర్ ని గుండెల్లో పెట్టి పూజిస్తుంటారు వ్యతిరేకమని చెప్పే విషయాన్ని మాల మహానాడు సంఘం ఖండిస్తూ ఉన్నదని మాలలు అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని గాని ఎక్కడైనా వ్యతిరేకిస్తున్నట్లు అనిపిస్తే మాలమహానాడు సంఘం బహిరంగ సభకు సిద్ధంగా ఉన్నామని ఇలాంటి వ్యతిరేక కార్యకలాపాలు మాలల మీద మానుకోవాలని గొప్ప వీరయ్య ని సూటిగా ప్రశ్నిస్తున్నామని రామచంద్రం మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుల సంఘాల నాయకులు మాల మహానాడు జిల్లా యూత్ అధ్యక్షులు మోదుగు బాబు, మాల మహానాడు జిల్లా నాయకులు బోడ బొర్రయ్య నేతకాని సంఘం జిల్లా నాయకులు దుర్గం నరసింహారావు మాల మహానాడు మండల నాయకులు బోడ అచ్చయ్య ఎమ్మార్పీఎస్ మండల నాయకులు పుల్లూరి తిరుపతి,బిల్ పాటి నరసింహారావు,బోడా భూషణం, బోడా నాగేష్,పూస ప్రశాంత్,నంది సందీప్, బోడ శివయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: