CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతిని పురస్కరించుకుని ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి. రవి ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లందు పట్టణంలోని స్థానిక జగదాంబ సెంటర్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. . అతి చిన్న వయసులోనే దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిన మహనీయుడు అని కొనియాడారు.పిసిఓ బూతులను గ్రామస్థాయిలో చేర్చి, ఎం .టి .ఎన్ ఎల్. వి. ఎస్. ఎల్ ఆల్ ద్వారా అందరికీ ఫోన్లు అందుబాటులోకి వచ్చేలా చేశారని అన్నారు. దేశంలో టెక్నాలజీ, కంప్యూటరీకరణ, రైళ్లలో కంప్యూటర్ ద్వారా రిజర్వేషన్ సిస్టం తీసుకొచ్చిన మహానుభావుడని తెలిపారు. ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల కుదిస్తూ ప్రజాస్వామ్యంలో యువతకు పెద్దపీట వేశారన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయిలో పటిష్టం చేసేలా చర్యలు చేపట్టారని తెలిపారు. 1986 లో ఎన్. పి. ఈ ( నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ఎడ్యుకేషన్) ద్వారా రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని, జహార్ నవోదయ విద్యాలయం ద్వారా ఎంతో మందికి గ్రామీణ విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించి వారికి ఉన్నత స్థాయిలో వారిని జీవితాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడని అన్నారు. ఈ కార్యక్రమంలో లో పట్టణ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవి భద్రం, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గొచికొండ శ్రీదేవి, ఐఎన్టియుసి కేంద్ర కమిటీ సభ్యులు గొచికొండ సత్యనారాయణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధరావత్ క్రిష్ణ, కమల, కోటగిరి నవీన్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాంబ మహేష్, శేఖర్, పసిక తిరుమల్, లక్ష్మణ్ రావు, వాసుదేవ్, పొడుగు రాంబాబు, బి. ఎన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: