CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహిళలకు చీరల పంపిణీ

Share it:

 


*ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జన్మదినం సందర్భంగా స్పందన స్ఫూర్తి సొసైటీ వారి ఆధ్వర్యంలో పంపిణీ.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో రంగపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన స్పందన స్ఫూర్తి సొసైటీ ఆధ్వర్యంలో ఆదివాసీ వృద్ద మహిళలకు తెరాస పార్టీ మండల అధ్యక్షులు మురహరి భిక్షపతి చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మురహరి భిక్షపతి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి ఉద్యమం చేసి ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రజల మనస్సు గెలిచిన జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ జన్మదినం సందర్భంగా రంగపూర్ గ్రామంలోని వృద్ద మహిళలకు చీరలను పంపిణీ చేశాం అని తెలిపారు.గతంలో కరోనా సమయంలో రంగపూర్ గ్రామంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చేతుల మీద బియ్యం,కూరగాయలు పంపిణీ చేశాం అని గుర్తు చేశారు.

స్పందన స్ఫూర్తి సొసైటీ అధ్యక్షులు నెమలి బాలకృష్ణ 

ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్ కుసుమ జగదీష్ ఎన్నిక అయిన నుండి 2019 సంవత్సరం రక్త దానం,2020 సంవత్సరములో అన్న ధానం చేశాము అన్నారు.ఈ సంవత్సరములో వస్త్రదానం చేశాము అని తెలిపారు.అన్ని ధానాల కన్నా అన్నదానం, వస్తారాదానం గొప్పది.

ములుగు జిల్లా ప్రజలు ఆశీర్వదించిన ప్రజాప్రతినిధులు కుసుమ జగదీష్ జిల్లా  అభివృద్ధి చేయడంలో దేవుడు కనికరం ఉండాలి అని సదుద్దేశంతో  పేదలకు వస్త్ర ధానం లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం అని తెలిపారు. 

ప్రజలు అందరు కరోన మహమ్మారి అంతం అయి దేవుడు దయతో బాగుడాలి అని సొసైటీ ఉపాధ్యక్షుడు దూడపక రాజేందర్ అన్నారు. 

ఈ వేదిక నుండి ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు నెమలి బాలకృష్ణ, ఉపాధ్యక్షుడు దూడపక రాజేందర్,ప్రధాన కార్యదర్శి బలుగురి శ్రీను,దళిత జన సేవ సమితి మండల అధ్యక్షులు జన్ను సుధాకర్,రైతు బంధు చల్వాయి కో ఆడినేటర్ బొల్లం ప్రసాద్ గాంధీనగర్ తెరాస గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ వెంకన్న,రాంనగర్ అధ్యక్షులు జన్ను రాంబాబు,దళిత జన సేన గ్రామ అధ్యక్షులు జన్ను రమేష్,సీనియర్ నాయకులు బొజ్జ రమేష్,తెరాస పార్టీ ఎస్సి సెల్ మండల ప్రధాన కార్యదర్శి

కొంపెల్లి హరిబాబు,అంబల ముత్తయ్య,రేగుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: