CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉అమరజీవి సున్నం రాజయ్య ప్రధమ వర్ధంతి సభ..

Share it:


👉ప్రజల పల్లి ఎత్తిపోతల పథకానికి సున్నం రాజయ్య పేరు నామకరణం చేయాలి.. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎలమంచి రవికుమార్

👉 అసెంబ్లీలో కోయ భాషలో  మాట్లాడిన ఏకైక గిరిజన ఎమ్మెల్యే


మన్యం టీవీ దుమ్ముగూడెం ,ఆగస్టు 3: భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు గా మూడు పర్యాయాలు ప్రతినిత్యం వహించిన అమరజీవి సున్నం రాజయ్య పేరును ఎత్తిపోతల పథకానికి నామకరణం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రవి కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరజీవి సున్నం రాజయ్య ప్రధమ వర్ధంతి వేడుకలను మూలపాడు లోనే ఎలమంచిలి సీతారామయ్య భావంతో పాటు సిపిఎం గ్రామ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా రాజయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అంటే ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించడం వల్లనే అని ఆయన అన్నారు పనిచేసిన సమయంలో వాజేడు మండలం లొట్టిపిట్ట గండి దగ్గర నుండి చింతూరు మండలం వరకు అనేక సాగునీటి ప్రాజెక్టుల తో పాటు తాలిపేరు సరిహద్దులపై మారుమూల గ్రామాలకు రహదారులు విద్య వైద్యం వంటి మౌలిక సదుపాయాల కోసం ఆయన ఎనలేని కృషి చేశారన్నారు మండలం ప్రగలపల్లి వద్ద గోదావరి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మించాలని సిపిఎం పార్టీ అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగిందన్నారు 2014లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య రైతు సంఘం నాయకుడు లాగా ఎత్తిపోతల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవడం జరిగిందన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడవసారి గెలుపొంది శాసనసభలో ప్రజల కోసం 100 కోట్లు కేటాయించాలని నా గిరిజన గ్రామాలకు సాగునీరు అందించాలని కోయ బాషా లో మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజల జీవితాంతం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు ఎత్తిపోతల పథకం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభలో తన గళం వినిపించిన ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి ఎత్తిపోతల పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ, శాఖా కార్యదర్శులు నరసింహారావు, సాంబశివరావు రైతు సంఘం మండల కార్యదర్శి చంద్ర రావు సర్పంచ్ ఉపసర్పంచ్ రామ్మోహన్రెడ్డి కొల్లి సత్యనారాయణ ,సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్, శ్రీనివాస్ రెడ్డి ఇ ఎన్ డి బేబీ ,నాగిరెడ్డి, వెంకన్న ,ప్రవీణ్ ముత్యాలు, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: