CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు...

Share it:

 



మన్యం టీవీ : జూలూరుపాడు,

ఆగస్టు 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సి డి పి ఓ సిహెచ్ నిర్మల జ్యోతి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వీరబాబు మాట్లాడుతూ.. ప్రసవించిన తల్లులందరూ వారి పిల్లలకు తప్పనిసరిగా  6 నెలల వరకు రొమ్ము పాలు పట్టించాలని కోరారు. తల్లి పాలు కాకుండా ఏ ఇతర డబ్బా పాలు పట్టించ కూడదఅని తెలిపారు. ప్రసవం అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు బిడ్డలకు అమృతంలా పని చేస్తాయని అన్నారు. పిల్లలకు వచ్చే అనేక రకాల వ్యాధులను అరికట్టడంలో మొదటి టీకా లాగా పనిచేస్తాయని తెలిపారు. తల్లులు తమ పిల్లలకి రొమ్ము పాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డల అనుబంధం  పెరుగుతుందన్నారు. అంతేకాకుండా తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడం వలన తల్లికి చెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లాంటి ప్రమాదకరమైన జబ్బులు రావని తెలిపారు. బిడ్డకు, బిడ్డకు మధ్య కనీసం 2 సంవత్సరాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని కోరారు. పిల్లలు పాలు త్రాగడం వలన తల్లికి మలి కానుపు త్వరగా రాదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తల్లిపాల ప్రాముఖ్యత గురించి గ్రామాలలో ఆగస్టు 1 నుండి 7 వరకు అంగన్ వాడి కార్యకర్తలు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, సి హెచ్ ఓ వెంకటేశ్వరరావు, సూపర్వైజర్ జి అరుణ, ఎం లక్ష్మి, ఏ డబ్ల్యు టి ఎస్, లు ఏఎన్ఎం, లు ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: