CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


★【 స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న అన్ని శాఖల జిల్లా, మండలాల, పంచాయతీల అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు】★

మన్యం మీడియా ప్రతినిధి / కొత్తగూడెం:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానం నందు నిర్వహించిన 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి,జిల్లా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రేగా మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలకు 75 వ స్వతంత్ర దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, ఎందరో త్యాగధనులు ప్రాణ త్యాగఫలం, నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం అని, బ్రిటిష్ పాలన నుండి మన దేశానికి స్వతంత్రం సాధించడానికి జరిగిన స్వతంత్ర భారతావని పోరులో ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను తృణ పాయం చేశారని, ఆ మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.అనంతరం జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల సమగ్ర సమాచారాన్ని జిల్లా ప్రజలకు తెలియజేసి, జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, స్వాతంత్ర ఉద్యమకారులను సన్మానించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన పలు శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలను, మెమొంటో లను అందజేసి, ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు చెక్కులను అందజేశారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి(ఐఎఎస్) , జిల్లా ఎస్పీ స్సునీల్ దత్త్(ఐపీఎస్),స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తదితర ముఖ్యులు, జిల్లా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: